News March 18, 2025

ఎప్పుడూ నీరసం, అలసటగా ఉంటుందా?

image

కొందరికి ఎలాంటి శారీరక, మానసిక శ్రమ చేయకపోయినా నీరసం, అలసట వస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే దీనిని నివారించవచ్చు. శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఉదయం ఏదో ఒక ఆహారం తింటే నీరసం, అలసట ఉండదు. లంచ్‌లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. వారంలో ఒకరోజుకు మించి ఉపవాసం చేయకూడదు.

Similar News

News March 18, 2025

నేడు ప్రధానితో సీఎం భేటీ

image

AP: CM చంద్రబాబు ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతోపాటు పలు అంశాలపై PMతో చర్చించనున్నారు. అలాగే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీని కోరనున్నట్లు సమాచారం. అనంతరం హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు.

News March 18, 2025

డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం

image

TG: లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం ఉండేలా డీలిమిటేషన్ ప్రక్రియ ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షతన నియోజక వర్గాల పునర్విభజనపై అసెంబ్లీ కమిటీ హాల్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని వివిధ పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అఖిలపక్ష సమావేశంపై ప్రభుత్వానికి స్పష్టత లేదని కేటీఆర్ విమర్శించారు.

News March 18, 2025

విలేజ్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్‌లో మెగాస్టార్..?

image

చిరంజీవి- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే మూవీపై ఓ క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా ఇందులో హీరోయిన్‌గా అదితిరావు హైదరీని ఎంచుకున్నట్లు టాక్. గతంలోనూ మెగాస్టార్ విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో నటించిన చిత్రాలు విజయం సాధించడంతో పాటు..అనిల్ రావిపూడి కాంబో కావడంతో ఈ చిత్రం పై అంచనాలు భారీగా పెరిగాయి.

error: Content is protected !!