News September 16, 2025
వరికి అధికంగా యూరియా వేస్తున్నారా?

వరి నాట్లు వేసిన 2-3 వారాల మధ్య.. పైరు చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు రెండుసార్లు యూరియా వేయాలి. ప్రతిసారీ ఎకరాకు 35 నుంచి 45 కిలోల యూరియా వేస్తే సరిపోతుంది. చాలామంది రైతులు మాత్రం ఎకరాకు ఒకటిన్నర నుంచి రెండు బస్తాల వరకు యూరియా వేస్తున్నారు. అధిక యూరియా వల్ల అధిక దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో రైతులు ఇలా చేస్తున్నారు. దీని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Similar News
News January 30, 2026
KCRకు ఇచ్చిన నోటీసులు చెల్లవు: BRS లాయర్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు ఇచ్చిన సిట్ నోటీసులు చెల్లవని BRS తరఫు లాయర్ మోహిత్ రావు తెలిపారు. CRPC 160 ప్రకారం నోటీసులు ఇవ్వలేరని, గతంలో ఇలాంటి కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. 65 ఏళ్లు దాటినవారిని ఇంటి వద్దే విచారించాలని పేర్కొన్నారు. ఇక రాజకీయ కక్షసాధింపులో భాగంగానే సిట్ నోటీసులు ఇచ్చిందని, అవసరమైతే దీనిపై న్యాయ పోరాటం చేస్తామని మోహిత్ రావు స్పష్టం చేశారు.
News January 30, 2026
చూడి పశువుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మిగిలిన పశువుల కంటే చూడి పశువుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని బయటకు వదలకుండా కొట్టం దగ్గరే పరిమితమైన వ్యాయామం కల్పించాలి. శుభ్రమైన మేత, తాగునీరు అందించాలి. కొట్టంలో జారుడునేల లేకుండా చూడాలి. ఇతర పశువులతో పోట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కలు వీటి వెంటపడి పరిగెత్తించకుండా చూడాలి. కాలువలలో దించడం, వాలుగా ఉన్న ఎత్తయిన గట్లు ఎక్కించడం, ఎక్కువ దూరం నడిపించడం చేయకూడదు.
News January 30, 2026
ఫిబ్రవరి 6న OTTలోకి ‘రాజాసాబ్’!

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘రాజా సాబ్’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్ కానుందని జియో హాట్‌స్టార్ పేర్కొంది. మొత్తం 4 భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిపింది. భారీ బడ్జెట్‌తో హారర్ ఫ్యాంటసీగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.


