News April 13, 2025
సిగ్గుందా?.. యూసుఫ్ పఠాన్‌పై తీవ్ర విమర్శలు

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా బెంగాల్లో జరుగుతున్న ఆందోళనల్లో ముగ్గురు చనిపోయారు. మాజీ క్రికెటర్, TMC MP యూసుఫ్ పఠాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న బహరంపూర్లోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదిలాఉంటే యూసుఫ్ చాయ్ తాగుతూ ఓ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఫైరవుతున్నారు. ఏమాత్రమైనా సిగ్గుందా? అని దుయ్యబడుతున్నారు. హిందువులు ఊచకోతకు గురవుతుంటే పఠాన్ ఎంజాయ్ చేస్తున్నారని BJP నేత షెహజాద్ ఫైరయ్యారు.
Similar News
News November 27, 2025
జాతీయస్థాయి పోటీల్లో పెదబయలు EMRS విద్యార్థి సత్తా!

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల(EMRS) విద్యార్థులకు నిర్వహించిన జాతీయ స్థాయి వాల్యూ ఎడ్యుకేషన్ ఒలంపియడ్ పోటీల్లో పెదబయలు EMRS విద్యార్థి సత్తా చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి 12 మంది విద్యార్థులు విజయం సాధించగా, AP నుంచి తమ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి కొర్ర గౌతమ్ 3వ స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్ అమిత్ ఆనంద్ తెలిపారు. గౌతమ్.. కేంద్ర మంత్రి చేతుల మీదుగా బహుమతి తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
News November 27, 2025
తిరుమల వెళ్లినప్పుడు దీన్ని తప్పక చూడండి

తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీకి ఎదురుగా తాళ్లపాక అర ఉంటుంది. దీన్నే సంకీర్తనా భాండాగారం అంటారు. 15వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమాచార్యులు రోజుకో కీర్తన రచించేవారట. ఆయనతో పాటు ఆయన వంశీకులు రచించిన అసంఖ్యాకమైన సంకీర్తనలన్నీ ఈ అరలోనే భద్రపరిచారు. ఈ అర బయట ఉన్న శిలా ఫలకంపై అన్నమయ్య ఉన్న చిత్రం ఉంటుంది. ఈసారి తిరుమల వెళ్లినప్పుడు దీన్ని అస్సలు మిస్సవ్వకండి.<<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 27, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో KCR మాజీ ఓఎస్డీ విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ CM KCR వద్ద OSDగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని జూబ్లీహిల్స్ PSలో సిట్ విచారిస్తోంది. దీంతో ఆయన ఎలాంటి సమాచారం ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. INC ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టి సారించింది. ఈ కేసులో మాజీ IPS ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించింది. పలువురు రాజకీయ ప్రముఖుల వాంగ్మూలాలను సిట్ రికార్డ్ చేసింది.


