News April 8, 2025
ఇలా చేయడానికి సిగ్గుందా?: YS జగన్

AP: లింగమయ్య హత్య ఘటనలో 20 మందికి పైగా పాల్గొంటే, ఇద్దరిపైనే కేసులు పెడతారా? అని YS జగన్ ప్రశ్నించారు. ‘బేస్ బాల్ బ్యాట్, కత్తులు, కట్టెలతో దాడి చేశారు. బ్యాట్‌తో చేసిన దాడిలో లింగమయ్య చనిపోయారు. ఇది న్యాయమా? ధర్మమా అని సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. ఇలాంటి చర్యలకు చేయడానికి సిగ్గుందా? హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యే, ఆమె కొడుకుపై కేసులు పెట్టరా?ఉండవా?’ అని జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Similar News
News April 17, 2025
హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు

TG: హైదరాబాద్‌లో 26 శాతం ఇళ్ల అమ్మకాలు పడిపోయినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్‌టైగర్ తెలిపింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య 10,647 యూనిట్ల హౌస్ సేల్స్ జరిగినట్లు వెల్లడించింది. అదే గతేడాది ఇదే వ్యవధిలో 14,298 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు పేర్కొంది. బెంగళూరులో 13 శాతం, చెన్నైలో 8 శాతం సేల్స్ పెరిగినట్లు వివరించింది.
News April 17, 2025
నేటి నుంచి ‘భూభారతి’ రెవెన్యూ సదస్సులు

TG: ‘భూభారతి’ పైలెట్ ప్రాజెక్ట్‌కు ఎంపిక చేసిన 4 మండలాల్లో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. అక్కడ రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులు దరఖాస్తులు స్వీకరించి, వాటిని పోర్టల్ ద్వారా పరిష్కరిస్తారు. అందులో పరిష్కారం కాకున్నా, పోర్టల్ పని చేయకపోయినా రాష్ట్రస్థాయిలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఈ సదస్సులను మంత్రి పొంగులేటి ఇవాళ నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రారంభించనున్నారు.
News April 17, 2025
ఫెయిలైన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు

AP: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో చదువుతూ ఇంటర్ ఫెయిలైన, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి వేసవిలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు. ఇందుకోసం కేజీబీవీ హాస్టళ్లను ఉపయోగించుకోవాలని భావించింది. కాగా ఆదర్శ పాఠశాలల్లో ఫస్టియర్‌లో 44%, సెకండ్ ఇయర్లో 18% శాతం మంది ఫెయిలయ్యారు.