News March 27, 2025

ఈ ట్రెండ్ గురించి తెలుసా?

image

గత రెండు రోజులుగా ‘గిబ్లి’ ట్రెండ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ తన X ఖాతా డీపీగా ఏఐ ఇమేజ్‌ను క్రియేట్ చేసి పెట్టుకున్నారు. దీంతో లక్షలాది మంది యూజర్లు చాట్‌జీపీటీ సాయంతో తమ ఫొటోలను ‘గిబ్లి’ స్టైల్లో ఎడిట్ చేసుకుని షేర్ చేస్తున్నారు. గిబ్లి అనేది జపాన్‌లోని ఓ ప్రఖ్యాత యానిమేషన్ స్టూడియో.

Similar News

News November 1, 2025

అధికారులు అద్భుతంగా పని చేశారు: CM చంద్రబాబు

image

AP: మొంథా తుఫాన్ సమయంలో అధికారులు అద్భుతంగా పని చేశారని CM చంద్రబాబు ప్రశంసించారు. పెను ప్రమాదం తప్పిందని, ముందు జాగ్రత్తతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించామని అన్నారు. తన జీవితంలో చాలా తుఫాన్లు చూశానని, ఈ సారి యంత్రాంగం, టెక్నాలజీ సాయంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. 602 డ్రోన్లను వినియోగించి ట్రాక్ చేశామన్నారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సన్మాన పత్రాలు, మెమెంటోలు అందజేశారు.

News November 1, 2025

అయ్యప్ప దీక్ష: స్వామి అనే ఎందుకు పిలుస్తారు?

image

అయ్యప్ప మాలధారణలో ‘నేను’ అనే భావం ఉండదు. పేర్లు, వస్త్రాలు, దినచర్య.. వీటన్నింటినీ వదిలి దైవారాధనలో భాగమవుతారు. దీక్ష స్వీకరించాక తన వ్యక్తిత్వాన్ని విడిచి, అంతర్లీనంగా దైవ స్వరూపంగా మారతారు. జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో.. ఆ వ్యక్తిని ప్రత్యేకించి కాక, పరమాత్మ అంశగా చూస్తారు. అందుకే అయ్యప్ప ప్రతిరూపంగా వారిని ‘స్వామి’ అని పిలుస్తారు. ఇది ప్రతి భక్తుడిని భగవంతునిగా గౌరవించే గొప్ప ఆచారం.

News November 1, 2025

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

రాజస్థాన్ పిలానీలోని CSIR-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (<>CEERI<<>>) 23 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://www.ceeri.res.in/