News October 5, 2025

గేదెను కొంటున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి

image

గేదెను కొనుగోలు చేసేటప్పుడు అది ఎప్పుడు ఈనింది, ఎన్నవ ఈతలో ఉంది, ఈనిన తర్వాత ఎన్ని నెలలు పాడిలో ఉంది, కట్టినట్లయితే ఎన్ని నెలలు గర్భంలో ఉంది, వట్టి పోయి ఎంతకాలమైంది, ఈనడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది అనే విషయాలను తప్పకుండా యజమానిని అడిగి తెలుసుకోవాలి. సంతలో పశువులను కొనుగోలు చేయాలనుకుంటే వాటికి రంగులు వేశారా? కొమ్ములు చెక్కారా? వంటివి గమనించి కొనాలి. పొదుగు జబ్బు వచ్చిన గేదెలు కొనకూడదు.

Similar News

News March 13, 2026

ఈనెల 18 నుంచి పెళ్లిళ్లు.. గ్యాస్ కొరతపై ఆందోళన

image

ఈనెల 18 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుంది. యుద్ధం వల్ల ఏర్పడిన గ్యాస్ కొరత ప్రభావం పెళ్లి భోజనాలపై పడనుంది. ఫంక్షన్లకు పెద్ద ఎత్తున వంటలు చేసే క్యాటరింగ్ నిర్వాహకులు గ్యాస్ స్టవ్‌లను ఉపయోగిస్తుంటారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో వంటలు ఎలా చేయాలనే ఆందోళన మొదలైంది. ఇక కట్టెల పొయ్యిపైనే వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కట్టెలకూ డిమాండ్ పెరుగుతుండడంతో వివాహాలు చేసే కుటుంబాలపై మరింత భారం పడనుంది.

News March 13, 2026

పాక్ ప్లేయర్ కొనుగోలుపై వివాదం.. సన్‌రైజర్స్‌కు షాక్!

image

‘The Hundred’ టోర్నీకి <<19366541>>పాక్<<>> ఆటగాడు అబ్రార్‌ను కొని విమర్శలు ఎదుర్కొంటున్న సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి మరో షాక్ తగిలింది. సన్‌రైజర్స్ లీడ్స్ X అకౌంట్ సస్పెండ్ అయింది. రూల్స్ ఉల్లంఘించిన అకౌంట్లను X సస్పెండ్ చేస్తుందని ఆ పేజ్‌లో ఉంది. యూజర్లు రిపోర్ట్ చేయడం ఓ కారణంగా తెలుస్తోంది. ఫ్రాంచైజ్ ఓనర్ కావ్యా మారన్‌పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ ఐపీఎల్‌లో SRH మ్యాచ్‌లు బాయ్‌కాట్ చేయాలని SMలో ట్రెండ్ చేస్తున్నారు.

News March 13, 2026

పచ్చి ఆకు ఎరువుతో కలిగే ప్రయోజనాలు

image

కొన్ని రకాల చెట్ల నుంచి పచ్చి లేత కొమ్మలను సేకరించి పొలంలో వేసి కలియదున్నడాన్నే పచ్చి ఆకు ఎరువు అంటారు. పొలంలో దుక్కి చేసే రోజే లేత కొమ్మలు, ఆకులను చేనంతా వేసి భూమిలో కలియదున్నాలి. ఇది క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి మట్టిని సారవంతం చేస్తుంది. ఈ భూమిలో వేసిన పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. కానుగ, సీతాఫలం, అవిశ, తంగేడు, వేప వంటి మొక్కలను పచ్చి ఆకు ఎరువు కోసం ఎంపిక చేసుకోవచ్చు.