News October 29, 2024
కార్ కొంటున్నారా?.. వీటిపై లక్షకుపైగా డిస్కౌంట్

అమ్మకాలు తగ్గడంతో కార్ల కంపెనీలు లక్షల్లో డిస్కౌంట్లు ప్రకటించాయి. పలు కార్ల తగ్గింపు ధరలు: మహింద్రా థార్ (3 డోర్) ₹1.5 లక్షలు, XUV400 ₹3 లక్షలు, కొన్ని XUV700 మోడల్స్ పై ₹2 లక్షలు *మారుతీ బాలెనో ₹1.1 లక్షలు *మారుతి గ్రాండ్ విటారా ₹1.1-1.4 లక్షలు *పాత మోడల్ స్కార్పియో ₹1.2 లక్షలు *Toyota Fortuner ₹2 లక్షలు *జీప్ కంపాస్ ₹2.5 లక్షలు *ఎంజి గ్లోస్టర్ ₹4.9 లక్షలు *BMW X5 ₹7-10 లక్షలు తగ్గింపు.
Similar News
News January 1, 2026
Dec 31st.. బిర్యానీతో పాటు ఆశ్చర్యపరిచే ఆర్డర్లు

దేశవ్యాప్తంగా నిన్న రాత్రి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డెలివరీ యాప్‌లలో రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. ఎప్పటిలాగే బిర్యానీ టాప్‌లో నిలిచినా, ఈసారి కొన్ని ఆర్డర్లు ఆశ్చర్యపరిచాయి. ఐఫోన్లు, బంగారు నాణేలు, స్మార్ట్ వాచ్‌లు, ఉప్మా, కిచిడీ, హల్వా, సలాడ్లు సైతం పలువురు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. స్విగ్గీ నుంచి ఒక్క రోజే 2 లక్షలకు పైగా బిర్యానీలు, లక్షకు పైగా బర్గర్లు డెలివరీ అయ్యాయి.
News January 1, 2026
‘స్పిరిట్’ లుక్‌పై ఫ్యాన్స్ ఖుషీ.. మీకెలా అనిపించింది!

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ ఫస్ట్ పోస్టర్ SMను షేక్ చేస్తోంది. ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఫస్ట్ లుక్స్‌తో పోలిస్తే ‘స్పిరిట్’ లుక్ మరింత ఇంటెన్సివ్‌గా ఉందనే చర్చ నడుస్తోంది. ఈసారి ప్రభాస్‌ను సందీప్ సరికొత్తగా చూపించబోతున్నారని ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ‘స్పిరిట్’ లుక్ ఎలా ఉంది? COMMENT
News January 1, 2026
తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్

AP: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుపతి గరుడ జంక్షన్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. కాగా లక్కీ డిప్ టోకెన్లు ఉన్నవారికి నేటితో దర్శనాలు ముగియనున్నాయి. రేపటి నుంచి జనవరి 8 వరకు టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నారు.


