News January 1, 2025
న్యూఇయర్ విషెస్ లింక్ క్లిక్ చేస్తున్నారా?

కొత్త సంవత్సరాన్ని సైబర్ నేరగాళ్లు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. విషెస్ పేరుతో లింక్‌లు పంపిస్తూ పర్సనల్ డేటాను చోరీ చేసి, బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. కొందరు తెలియక వీటిని ఫార్వర్డ్ చేస్తున్నారు. అందుకే మీకు ఎంత దగ్గరివారైనా న్యూఇయర్ సందర్భంగా పంపే లింక్‌లను క్లిక్ చేయకపోవడం బెటర్. ఫ్రీ రీఛార్జ్, భారీ డిస్కౌంట్లు, తక్కువ ధరకే న్యూఇయర్ ఈవెంట్ పాస్‌లు వంటి లింక్‌లకు దూరంగా ఉండండి.
SHARE IT
Similar News
News November 12, 2025
ప్లాన్ చేసి ప్రిపేర్ అయితే.. ప్రభుత్వ ఉద్యోగం పక్కా

ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే ప్రభుత్వ ఉద్యోగానికి నిర్వహించే రాత, ఫిజికల్, మెడికల్ టెస్టుల్లో పాస్ కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. సమయపాలన ముఖ్యమని గుర్తుంచుకోవాలి. మాక్ టెస్టులు ఎక్కువగా రాయాలి. పోలీస్, ఆర్మీ, బీఎస్ఎఫ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్‌పై శ్రద్ధపెట్టాలి.
News November 12, 2025
CWCలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్(CWC) 11 కాంట్రాక్ట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB/LLM, MBA/PGDM, MSc(స్టాటిస్టిక్స్), BSc(స్టాటిస్టిక్స్), BBA, ఎంటెక్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
News November 12, 2025
విడాకుల వార్తలకు చెక్ పెట్టిన శర్వానంద్!

టాలీవుడ్ హీరో శర్వానంద్, ఆయన భార్య రక్షిత విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు ఓ ఇంటర్వ్యూలో ఆయన ఇన్‌డైరెక్ట్‌గా చెక్ పెట్టారు. ‘తండ్రి అయ్యాకే ఆరోగ్యంపై దృష్టి పెట్టా. అంతకుముందు వర్కౌట్స్ చేసేవాడిని కాదు. నా కుటుంబం కోసం ఆరోగ్యంగా, స్ట్రాంగ్‌గా ఉండాలని డిసైడయ్యా’ అని పేర్కొన్నారు. 2019లో యాక్సిడెంట్ తర్వాత తన బరువు 92kgsకి పెరిగిందని, కష్టపడి 22kgs తగ్గానన్నారు.


