News September 3, 2025

డీజేల దగ్గర డాన్స్ చేస్తున్నారా? జాగ్రత్త

image

ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 37 ఏళ్ల యువకుడు వినాయక నిమజ్జనంలో డీజే సౌండ్‌కు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఏ సంగీతమైనా నిర్దిష్ట పరిమితి దాటి ఫ్రీక్వెన్సీ పెంచితే గుండెపై హానికర ప్రభావం పడుతుందని పలు అధ్యయనాల్లోనూ తేలింది.
Share it

Similar News

News September 3, 2025

నా లేఖ లీక్ చేసింది సంతోష్ రావే: కవిత

image

TG: కేసీఆర్‌కు తాను రాసిన లేఖను లీక్ చేసింది సంతోష్ రావేనని కవిత ఆరోపించారు. ‘నా దగ్గర ఉన్న విషయాలన్నీ బయటపెడితే BRS నేతలంతా ఇబ్బందిపడతారు. హరీశ్, సంతోష్ అక్రమాల గురించి గతంలోనే KCRకు చెప్పా. ఇప్పటివరకు రెండు గ్యాంగులతో అంతర్గతంగా పోరాడా. ఇప్పుడు బయట నుంచి ఫైట్ చేస్తా. చెప్పాల్సింది చాలా ఉంది. ఒక్కొక్కటిగా బయటపెడతా’ అని మీడియాతో పేర్కొన్నారు.

News September 3, 2025

కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదు: మంత్రి తుమ్మల

image

కేంద్రానికి ముందు చూపు లేకపోవడంతోనే దేశంలో యూరియా కొరత ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ‘చైనా నుంచి రావాల్సిన యూరియా రాకపోవడం, దేశీయంగా ఉత్పత్తి పెంచకపోవడం వల్ల కొరత వచ్చింది. రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్‌కి ఆస్కారం లేదు. రామగుండంలో 4 నెలలుగా ఉత్పత్తి నిలిచిపోయింది’ అని వివరించారు. ఇటీవల వర్షాలు, వరదల వల్ల 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, సాయం చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు.

News September 3, 2025

వంగ, బెండలో తొలి దశలో చీడపీడల నివారణ

image

వంగ, బెండ మొక్కలపై తొలి దశలో అక్షింతల పురుగు, పెంకు పురుగులను గమనిస్తే ఏరి చంపేయాలి. కొమ్మతొలుచు పురుగు ఆశించిన రెమ్మలను కింది వరకు తుంచి నాశనం చేయాలి. పంట కాపునకు ముందు దశలో పురుగుల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిపాస్, 2.5ml క్వినాల్‌ఫాస్, 2ml ప్రొఫెనోఫాస్ మందులలో ఏదో ఒకదానిని 5ml వేపమందుతో కలిపి స్ప్రే చేయాలి. అవసరాన్ని బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మందు మార్చి మరోసారి స్ప్రే చేయవచ్చు.