News July 25, 2024

స్టాక్ ట్రేడింగ్ చేస్తున్నారా.. సెబీ వార్నింగ్

image

కుటుంబం కోసం దాచుకున్న డబ్బును స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు వాడొద్దని ప్రభుత్వం, సెబీ వార్నింగ్ ఇచ్చాయి. సత్వర సంపాదన కోసం స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టొదని సూచించాయి. షేర్లు ఆటుపోట్లకు గురవుతాయి కాబట్టి దీర్ఘకాలం మదుపు చేయాలన్నాయి. FY23లో 10 ఇంట్రాడే ట్రేడ్స్‌లో ఏడింట్లో నష్టమే మిగిలిందని చెప్పాయి. గత ఏడాది పదిలో 9 మంది యాక్టివ్ ట్రేడర్లు డెరివేటివ్స్‌లో లాస్ అయ్యారని హెచ్చరించాయి.

Similar News

News November 22, 2025

సూర్యాపేట: ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ కృషి: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్డు జంక్షన్‌ను ఆయన ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాంతో కలిసి పరిశీలించారు. ప్రతి వాహనదారుడి భద్రత ముఖ్యమన్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రజలు సైతం రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎస్పీ నరసింహ కోరారు.

News November 22, 2025

నిటారుగా ఉండే కొండ దారి ‘అళుదా మేడు’

image

అయ్యప్ప స్వాములు అళుదా నదిలో స్నానమాచరించిన తర్వాత ఓ నిటారైన కొండ ఎక్కుతారు. ఇది సుమారు 5KM ఉంటుంది. ఎత్తైన గుండ్రాళ్లతో కూడిన ఈ దారి యాత్రికులకు కఠినమైన పరీక్ష పెడుతుంది. పైగా ఇక్కడ తాగునీటి సౌకర్యం కూడా ఎక్కువగా ఉండదు. స్వామివారి నామస్మరణతో మాత్రమే ఈ నిట్టనిలువు దారిని అధిగమించగలరని నమ్ముతారు. ఈ మార్గాన్ని దాటితేనే యాత్రలో ముఖ్యమైన ఘట్టం పూర్తవుతుందట. <<-se>>#AyyappaMala<<>>

News November 22, 2025

వరికి మానిపండు తెగులు ముప్పు

image

వరి పంట పూత దశలో ఉన్నప్పుడు గాలిలో అధిక తేమ, మంచు, మబ్బులతో కూడిన వాతావరణం ఉంటే మానిపండు తెగులు లేదా కాటుక తెగులు ఆశించడానికి, వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని వల్ల వెన్నులోని గింజలు తొలుత పసుపుగా తర్వాత నల్లగా మారతాయి. తెగులు కట్టడికి వాతావరణ పరిస్థితులనుబట్టి సాయంకాలపు వేళ.. 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.