News March 24, 2025

రాత్రి బెడ్ రూమ్‌లో ఇలా చేస్తున్నారా?

image

నిద్ర పోయే సమయంలో బెడ్ రూమ్‌లోకి దోమలు రాకుండా నివారణ యంత్రాలను వాడుతుంటారు. వీటి వాసనను ఎక్కువగా పీల్చుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే హానికరమైన రసాయనాలతో శ్వాస సంబంధిత వ్యాధులకు ఆస్కారం ఉందంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, పెంపుడు జంతువులపై ప్రభావం ఉంటుందని అంటున్నారు. వీటికి బదులుగా సహజ ప్రత్యామ్నాయాలు వాడటం, దోమతెరలను ఉపయోగించడం ఉత్తమమని చెబుతున్నారు.

Similar News

News November 28, 2025

RR: నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే కారణాలు

image

గ్రామపంచాయతీ ఎన్నిక నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే కారణాలు ఇవే..
– నామినేషన్ పత్రాలను నిర్దిష్ట సమయంలో దాఖలు చేయకపోవడం
– నిర్దేశించిన చోట అభ్యర్థులు, ప్రతిపాదించే వారు సంతకాలు చేయకపోవడం
– ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే
– ఆస్తులు,అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని సరిగ్గా పొందుపర్చకపోవడం
– చట్ట ప్రకారం అవసరమైన డిపాజిట్ నగదును చెల్లించకపోవడం ప్రధాన అంశాలు.

News November 28, 2025

ఇలాంటి వరుడు అరుదు.. అభినందించాల్సిందే!

image

‘కట్నం అడిగినవాడు గాడిద’ అనే మాటను పట్టించుకోకుండా కొందరు అదనపు కట్నం కోసం వేధిస్తుంటారు. అలాంటిది కట్నం వద్దంటూ తిరిగిచ్చాడో యువకుడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన వరుడు కట్నం తీసుకునేందుకు నిరాకరించాడు. కొవిడ్ సమయంలో తండ్రిని కోల్పోయిన వధువు కుటుంబం రూ.31లక్షల కట్నం సిద్ధం చేసింది. ‘నాకు ఈ కట్నం తీసుకునే హక్కులేదు’ అని చెప్పి రూపాయి మాత్రమే స్వీకరించి ఔరా అనిపించాడు.

News November 28, 2025

ఐఐఎం విశాఖలో ఉద్యోగాలు

image

ఐఐఎం విశాఖపట్నం కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్చ్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.30వేలు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iimv.ac.in