News March 19, 2025
వేసవిలో కూల్ వాటర్ తాగుతున్నారా?

వేసవిలో రిఫ్రిజిరేటర్లో ఉంచిన నీటిని తాగవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండవేడికి తాళలేక చల్లగా ఉన్న నీటిని తాగితే శరీరం వాటిని తీసుకోలేదు. దీంతో తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి. జీర్ణాశయం పనితీరు నెమ్మదించి మలబద్ధకం, అజీర్తి సమస్యలు ఏర్పడుతాయి. ఎండ నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీరు తాగితే జలుబు, గొంతు మంట వచ్చే అవకాశముంది. దంతాలు దెబ్బతినే ఛాన్స్ ఉంది. మట్టికుండలోని నీరు తాగడం ఉత్తమం.
Similar News
News November 5, 2025
ఇండియన్ బ్యాంక్లో ఉద్యోగాలు

<
News November 5, 2025
వరి కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు

వరిని నూర్చేటప్పుడు వేర్వేరు రకాల ధాన్యం కలవకుండా జాగ్రత్త పడాలి. నూర్చిన ధాన్యాన్ని శుభ్రంగా తూర్పారబోసి చెత్త, తాలు, మట్టి బెడ్డలను ఏరేయాలి. చౌడు నేలల్లో పండించిన ధాన్యాన్ని, చీడపీడలు ఆశించి రంగు మారిన ధాన్యాన్ని మంచి ధాన్యంతో కలపకూడదు. తూర్పార బెట్టిన ధాన్యంలో మట్టి గడ్డలు, గడ్డి, కలుపు విత్తనాలు, మొక్కల అవశేషాలు లేకుండా చూడాలి. ఇలా శుభ్రం చేసిన ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉండి మంచి ధర వస్తుంది.
News November 5, 2025
‘ఇద్దరు పిల్లల’ నిబంధన ఎత్తివేత.. నేడు ఉత్తర్వులు

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను ఎత్తివేసే ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేశ్ ఆమోదం తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీకి అనర్హులుగా పేర్కొంటూ చేసిన చట్టం 1995 నుంచి అమల్లో ఉంది. తాజా నిర్ణయంతో పంచాయతీ, MPTC, ZPTC, పురపాలక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారూ పోటీ చేసేందుకు వీలు కలుగుతుంది.


