News July 27, 2024

ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: త్రిప్తి దిమ్రీ

image

‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన హీరోయిన్ త్రిప్తి దిమ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది గొప్ప నటీనటులతో వర్క్ చేయడం వల్ల తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అందరిలాగే తాను కూడా ‘యానిమల్ పార్క్’ మూవీ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. మరోవైపు సినీరంగంలో విమర్శలు సహజమని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వీటిని ఎదుర్కొంటూనే ఉంటారని పేర్కొన్నారు.

Similar News

News December 4, 2025

మెదక్: 2వ విడత బరిలో 670 మంది అభ్యర్థులు

image

మెదక్ జిల్లాలో రెండవ విడతలో జరగనున్న 8 మండలాల్లోని 149 గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొత్తం 670 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. చేగుంట (134), చిన్న శంకరంపేట్ (113), రామాయంపేట (87) మండలాల్లో అత్యధిక అభ్యర్థులున్నారు. శనివారం నాటి ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది.

News December 4, 2025

OTTలోకి మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్

image

‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. టామ్ క్రూజ్, హేలే అట్వెల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఆగస్టులో రెంటల్ పద్ధతిలో విడుదల చేయగా తాజాగా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే చూడొచ్చు. ఈ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలైంది.

News December 4, 2025

థైరాయిడ్‌ ట్యూమర్స్‌ గురించి తెలుసా?

image

థైరాయిడ్‌ గ్రంథి పనితీరుపైనే మనిషి జీవక్రియలు ఆధారపడి ఉంటాయి. ఇంతటి ప్రధానమైన థైరాయిడ్‌ గ్రంథిలో కొన్నిసార్లు ట్యూమర్స్ ఏర్పడతాయి. గొంతు భాగంలో వాపు/ గడ్డ ఏర్పడినట్లు కనిపిస్తుంది. ఈ వాపు అనేది ఆహారం తీసుకునేటప్పుడు లేదా మింగేటప్పుడు పైకీ కిందకీ కదులుతుంది. కానీ ఎటువంటి నొప్పి, ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. కణితి పరిమాణం పెరిగినప్పుడు ఆహారం తీసుకుంటుంటే పట్టేసినట్లుగా అనిపిస్తుంది.