News December 25, 2024
అరటి పండు తింటున్నారా?

అరటి, యాపిల్ తినే వారిలో ఏ కారణంతోనైనా మరణించే ముప్పు దాదాపు 40 శాతం తక్కువని ఓ అధ్యయనంలో తేలింది. వారంలో 3 నుంచి 6 సార్లు ఈ పండ్లు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచించారు. అరటిలో పుష్కలంగా ఉండే పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుందని తెలిపారు. కడుపు ఉబ్బరం తగ్గించడంతో పాటు శరీరానికి అత్యవసర శక్తి అందిస్తాయని పేర్కొన్నారు.
Similar News
News January 18, 2026
HEADLINES

* వందేభారత్ స్లీపర్ ప్రారంభించిన PM మోదీ
* బెంగాల్లో బీజేపీ రావాలి: PM మోదీ
* ఇరిగేషన్, ఎడ్యుకేషన్కే తొలి ప్రాధాన్యం: TG CM రేవంత్
* ప్రధాని అండతో అభివృద్ధిలో ముందుకెళ్తాం: AP CM CBN
* AP కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమకు శంకుస్థాపన
* రేవంత్ తుగ్లక్లా వ్యవహరిస్తున్నారు: KTR
* తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు
* JEE మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల
News January 18, 2026
భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారో తెలుసా?

ప్రపంచంలోనే ఎక్కువ సవరణలు జరిగింది భారత రాజ్యాంగంలోనే. 1949, NOV 26న రాజ్యాంగ సభ ఆమోదం పొంది 1950, JAN 26న అమలులోకి వచ్చినప్పటి నుంచి నేటివరకు 106సార్లు సవరణలు చేశారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించడాన్ని తప్పనిసరి చేస్తూ 2023 SEPలో చివరిగా సవరించారు. జనాభా లెక్కలు, నియోజకవర్గాల డీలిమిటేషన్స్ పూర్తైన తర్వాత రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి.
News January 18, 2026
‘గ్రీన్లాండ్ డీల్’ను వ్యతిరేకించిన దేశాలపై ట్రంప్ టారిఫ్స్

గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలనే తన లక్ష్యాన్ని వ్యతిరేకించిన దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగించారు. డెన్మార్క్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర యూరప్ దేశాలపై 10 శాతం సుంకాలు విధించారు. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. గ్రీన్లాండ్ డీల్ పూర్తి కాకపోతే జూన్ 1 నుంచి టారిఫ్స్ను 25 శాతానికి పెంచుతానని హెచ్చరించారు.


