News December 23, 2024
థియేటర్లో పాప్కార్న్ తింటున్నారా..!
సినిమా హాల్లో ఇంటర్వెల్ అవ్వగానే పాప్కార్న్ తెచ్చుకొని తినడం చాలామందికి అలవాటు. మల్టీప్లెక్సుల్లో వీటిధర రూ.250-350 వరకూ ఉంటోంది. ఇప్పటికే అంత పెట్టలేక కస్టమర్లు లబోదిబో అంటున్నారు. తాజాగా GST మండలి వీటిపై పన్నును వర్గీకరించడంతో భారం మరింతకానుంది. లూజ్ పాప్కార్న్పై 5, ప్రీప్యాక్డ్పై 12, కారమెల్ వంటి షుగర్ కోటింగ్స్ వేస్తే 18% GST అమలవుతుంది. ఇకపై నాలుకకు తీపి తగలాలంటే జేబుకు చిల్లుపడాల్సిందే.
Similar News
News December 23, 2024
కాంగ్రెస్ Vs బీఆర్ఎస్.. మధ్యలో అల్లు అర్జున్
TGలో అల్లు అర్జున్ కేంద్రంగా రాజకీయం నడుస్తోంది. బన్నీ అరెస్టైనప్పుడు KTR ట్వీట్తో దుమారం రేగింది. కుట్రపూరితంగా అతడిని ఇరికిస్తున్నారని INC, రేవంత్పై BRS విమర్శలు గుప్పించింది. ఎదురుదాడికి దిగిన INC.. AAకు బీఆర్ఎస్సే డైరెక్షన్స్ ఇస్తోందని ఆరోపించింది. మొత్తం వ్యవహారంలో AA, BRS అభిమానులు ఒకవైపు, కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయి. మరి ఈ ‘సినీ రాజకీయం’ ఎక్కడివరకు వెళ్తుందో, ఎక్కడ ఆగుతుందో చూడాలి.
News December 23, 2024
రేపటి నుంచి సెలవులు
క్రిస్మస్ ఈవ్ సందర్భంగా తెలంగాణలో కొన్ని స్కూళ్లకు రేపు ఆప్షనల్ హాలిడే ఉండనుంది. ఇప్పటికే సంబంధిత పాఠశాలల నుంచి విద్యార్థుల పేరెంట్స్కు సమాచారం అందింది. 25, 26న పబ్లిక్ హాలిడేస్ ఉండటంతో ఆయా పాఠశాలలకు వరుసగా 3 రోజులు, మిగతావాటికి 2 రోజులు సెలవులు రానున్నాయి. అటు ఏపీలోనూ రేపు కొన్ని స్కూళ్లకు ఆప్షనల్, 25న పబ్లిక్ హాలిడే, 26న ఆప్షనల్ హాలిడే ఉండనుంది.
News December 23, 2024
విధానం రద్దుతో డ్రాపౌట్స్: UTF
నో డిటెన్షన్ విధానాన్ని కేంద్రం రద్దు చేయడంపై తెలంగాణ UTF స్పందించింది. ఈ విధానం రద్దు చేయడం వల్ల స్కూళ్లలో డ్రాపౌట్స్ పెరుగుతాయని, పేదలకు విద్య దూరమవుతుందని అభిప్రాయపడింది. దీని వల్ల ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా 5, 8 తరగతుల విద్యార్థులు పరీక్షల్లో తప్పనిసరి పాస్ కావాలని నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.