News January 13, 2025

గాలిపటాలు ఎగురవేస్తున్నారా?

image

సంక్రాంతి అంటేనే గాలిపటాలు ఎగురవేయడం తప్పనిసరి. ముఖ్యంగా పిల్లలు గాలిపటాలు ఎగురవేయాలని ఉత్సాహపడుతుంటారు. వీటిని ఎగురవేసే సమయంలో మాంజాను కాకుండా సాధారణ దారాలను ఉపయోగించాలి. రోడ్ల పక్కన, రైల్వే ట్రాకులు, విద్యుత్ పోల్స్ సమీపంలో ఎగరవేయడం ప్రమాదకరం. భవనాలపై ఎగురవేసినప్పుడు, చిన్నపిల్లలు పక్కన ఉంటే జాగ్రత్తగా ఉండాలి. కాళ్లకు గాయాలు కాకుండా షూలు, చెప్పులు ధరించడం తప్పనిసరి.

Similar News

News January 13, 2025

Stock Markets: పండగ మురిపెం లేనట్టేనా!

image

స్టాక్‌మార్కెట్లు నేడు నెగటివ్ జోన్లో చలించొచ్చు. US జాబ్‌డేటా మెరుగ్గా ఉండటంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. ఫెడ్ వడ్డీరేట్లను కత్తిరించే అవకాశం లేకపోవడం ప్రతికూలంగా మారింది. US ట్రెజరీ యీల్డులు, డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్ ధరలు పెరగడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. జీవితకాల గరిష్ఠం నుంచి 11% మేర పతనమైన నిఫ్టీ 23,350 సపోర్టును మళ్లీ బ్రేక్ చేస్తే బేర్స్ విరుచుకుపడతాయని నిపుణుల అంచనా.

News January 13, 2025

బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ అదుర్స్

image

నందమూరి బాలకృష్ణ సెకండ్ ఇన్నింగ్సులో అదరగొడుతున్నారు. అఖండ నుంచి వరుసగా 4 సినిమాలు హిట్ అయ్యాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా డాకు మహారాజ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. వీటికి ముందు ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, రూలర్ మూవీలతో బాలయ్య పరాజయాలను ఎదుర్కొన్నారు. బాలకృష్ణ తన తర్వాతి సినిమా బోయపాటితో అఖండ-2 చేయబోతున్నారు.

News January 13, 2025

ఈ రోజున శివుడిని పూజిస్తే..

image

ఇవాళ చాలా ప్రత్యేకమైనది. పుష్య మాసంలో సోమవారం రోజున భోగి, పౌర్ణమి తిథి, ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం చాలా అరుదని పండితులు చెబుతున్నారు. ఏకాదశ రుద్రాలను పూజిస్తే లభించే ఫలితం ఇవాళ శివుడిని పూజిస్తే కలుగుతుందని అంటున్నారు. నువ్వుల నూనెతో దీపారాధన, పూజగదిలో శివ లింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. ఓం నమ: శివాయ అని పఠిస్తే ప్రయోజనకరమని అంటున్నారు.