News March 10, 2025

50-30-20 రూల్‌ పాటిస్తున్నారా?

image

సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించాలో తెలిసినవాడు గొప్పవాడు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీతంలో 50% ఇంటి అవసరాలు, హెల్త్ కేర్, రవాణా, పర్సనల్ కేర్, నిత్యావసర వస్తువుల కోసం ఖర్చు చేయాలి. మరో 30% షాపింగ్స్, ఔటింగ్స్ వంటి కోరికల కోసం ఉంచుకోండి. మిగతా 20శాతం మాత్రం పొదుపు చేయాలి. ప్రతి నెలా డబ్బును పొదుపు చేస్తూ భవిష్యత్తు కోసం పెట్టుబడులు ప్రారంభించండి. ఎమర్జెన్సీ ఫండ్‌ మెయింటేన్ చేయండి. SHARE IT

Similar News

News December 10, 2025

HEADLINES

image

* ముగిసిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. రాష్ట్రానికి మొత్తం రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు
* 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యం: TG CM రేవంత్
* అటల్ సందేశ్.. మోదీ సుపరిపాలన యాత్రలో నేతలంతా పాల్గొనాలి: AP CM CBN
* అన్ని రాష్ట్రాలు SIR కొనసాగించాల్సిందే: సుప్రీంకోర్టు
* APలో లారీల బంద్ తాత్కాలిక వాయిదా
* ఈ నెల 12న అఖండ-2 విడుదల.. ప్రకటించిన మేకర్స్
* సౌతాఫ్రికాతో తొలి టీ20లో భారత్ ఘన విజయం

News December 10, 2025

ఆ లెక్కలు చంద్రబాబు సృష్టే: జగన్

image

AP: 2025-26 ఏడాదికి ప్రభుత్వం ఇచ్చిన GSDP అంచనాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని YCP చీఫ్ జగన్ మండిపడ్డారు. ‘ప్రజలను మోసం చేసేందుకే ఈ గణాంకాలను CBN మార్గదర్శకత్వంలో తయారు చేశారు. కాగ్ నివేదికలు నిజమైన ఆదాయాలు, ఖర్చులను ప్రతిబింబిస్తున్నాయి. వాటి ప్రకారం ఆదాయాల పెరుగుదల తగ్గి, అప్పులు పెరిగాయి. అభివృద్ధి కోసం పెట్టే ఖర్చు, పెట్టుబడులు తగ్గాయి. రెవెన్యూ లోటు ఆందోళనకరంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.

News December 10, 2025

బుమ్రా అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా

image

టీమ్ ఇండియా దిగ్గజ పేసర్ జస్ప్రిత్ బుమ్రా అరుదైన రికార్డు నమోదు చేశారు. SAతో జరిగిన తొలి టీ20లో బ్రెవిస్‌ని ఔట్ చేసి 100 వికెట్స్ క్లబ్‌లో చేరారు. భారత్ తరఫున అర్ష్‌దీప్ తర్వాత ఈ ఘనత సాధించింది బుమ్రానే కావడం విశేషం. అలాగే అన్ని ఫార్మాట్లలో వంద వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పారు. బుమ్రా కంటే ముందు లసిత్ మలింగ, టిమ్ సౌథీ, షకీబ్ అల్ హసన్, షాహీన్ అఫ్రిది ఉన్నారు.