News July 19, 2024
మీ కంప్యూటర్లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ కనిపిస్తోందా? ఇలా చేయండి!

మైక్రోసాఫ్ట్ విండోస్‌లో బ్లూ స్క్రీన్ ఎర్రర్‌ను ఎలా ట్రబుల్ షూట్ చేయాలనే విషయాన్ని భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) వివరించింది.
*సిస్టమ్‌ను సేఫ్ మోడ్ లేదా రికవరీ మోడ్‌లో ఓపెన్ చేయాలి.
*C:\Windows\System32\drivers\CrowdStrike అనే డైరెక్టరీలోకి వెళ్లాలి.
*అందులో “C-00000291*.sys” అనే బగ్ ఫైల్ ఉంటే డిలీట్ చేయాలి.
*అనంతరం సిస్టమ్‌ను నార్మల్‌గా బూట్ చేయాలని సూచించింది.
Similar News
News December 5, 2025
నల్గొండ: ఎన్నికల వేళ.. జోరందుకున్న దావత్‌లు!

గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. గురువారం నుంచి మొదటి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బరిలో ఉన్న అభ్యర్థులు విందు, వినోదాలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో మటన్ కిలో రూ.800 నుంచి రూ.1,000 ధర పలుకుతుండడంతో చికెన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. కిలో చికెన్ రూ.220, స్కిన్ లెస్ కిలో రూ.250 పలుకుతోంది. లిక్కర్ అమ్మకాలూ విపరీతంగా పెరిగాయి.
News December 5, 2025
పుతిన్ సంపద ఎంత.. బిల్ గేట్స్ కన్నా ధనవంతుడా?

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన నేతల్లో పుతిన్ ఒకరు. ఆయనకు ఏడాదికి రూ.1.25 కోట్ల జీతం వస్తుందని, 800 చ.అ. అపార్ట్మెంట్, ప్లాట్, 3 కార్లు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి. కానీ పుతిన్ సంపద $200 బిలియన్లకు పైనే అని ఫైనాన్షియర్ బిల్ బ్రౌడర్ గతంలో చెప్పారు. ఇది బిల్ గేట్స్ సంపద ($113B-$128B) కన్నా ఎంతో ఎక్కువ. ఆయనకు విలాసవంతమైన ప్యాలెస్, షిప్, ఎన్నో ఇళ్లు, విమానాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.
News December 5, 2025
భగవంతుడిపై నమ్మకం ఎందుకు ఉంచాలి?

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః|
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్||
దేవుడు మనలోనే అంతరాత్మగా ఉంటాడు. ధనుస్సు ధరించి పరాక్రమంతో ధైర్యాన్నిస్తాడు. ప్రజ్ఞావంతుడు, ఉన్నత క్రమశిక్షణ గల ఆయన అన్ని విషయాలకు అతీతంగా ఉంటాడు. ఎవరూ భయపెట్టలేని విశ్వాసపాత్రుడు మన కార్యాలను నెరవేరుస్తూ, సకల ఆత్మలకు మూలమై ఉంటాడు. మనం ఆ పరమాత్మను గుర్తించి, విశ్వాసం ఉంచి ధైర్యంగా జీవించాలి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


