News July 6, 2025
వర్షంలో తడుస్తున్నారా?

కొందరు వర్షంలో తడుసుకుంటూ ఇంటికి వచ్చి యథావిధిగా పనులు చేసుకుంటుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తడిసిన వెంటనే దుస్తులు మార్చుకుంటే శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. దీనివల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ కారకాల నుంచి తప్పించుకోవచ్చు. శరీరంపై యాంటీ బాక్టీరియల్ క్రీమ్ రాసుకోవాలి. టీ లేదా కషాయాలు తాగాలి. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
Similar News
News July 7, 2025
శుభ సమయం (07-07-2025) సోమవారం

✒ తిథి: శుక్ల ద్వాదశి రా.10.14 వరకు తదుపరి త్రయోదశి
✒ నక్షత్రం: అనురాధ రా.1.08 వరకు తదుపరి జ్యేష్ట
✒ శుభ సమయం: ఏమీలేవు
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30-12.00 వరకు
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12 వరకు తిరిగి మ.2.46 నుంచి 3.34 వరకు
✒ వర్జ్యం: లేదు
✒ అమృత ఘడియలు: మ.1.50-3.36 వరకు
News July 7, 2025
TODAY HEADLINES

* ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం
* AP: ఎన్ఎఫ్‌డీబీని అమరావతికి తరలించండి: చంద్రబాబు
* తిరుమల రాత్రి భోజనంలోనూ వడలు
* TG: అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
* రైతులకు నీళ్లివ్వండి.. లేదంటే మేమే మోటార్లు ఆన్ చేస్తాం: హరీశ్ రావు
* CA ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల
* ‘హరిహర వీరమల్లు’ విడుదలకు నిరసన సెగ
News July 7, 2025
తెలంగాణలో ‘జాగీర్’ ఫైట్!

‘తెలంగాణ BRS జాగీరా?’ అని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ కోసం పోరాడింది BRS అని, తెలంగాణ తమ జాగీరే అని ఆ పార్టీ నేతలు పోస్టులు చేస్తున్నారు. ఆంధ్ర పత్రికలు మరోసారి విషం చిమ్ముతున్నాయని ఫైరవుతున్నారు. అయితే BRSని విమర్శిస్తే తెలంగాణను తిట్టినట్లు కాదని కాంగ్రెస్ నేతలు కౌంటరిస్తున్నారు. మళ్లీ సెంటిమెంటును రెచ్చగొడుతున్నారని మండిపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?