News February 9, 2025
మీ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా? అయితే రిస్క్లో పడ్డట్లే…

మీ పిల్లలు ఏడుస్తున్నారని ఫోన్లు ఇస్తున్నారా.. అయితే వారికి మీరు కీడు చేసినట్లే. చిన్నపిల్లల్లో 6నెలల నుంచి మాటలు రావటం ప్రారంభమవుతుంది. చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూనే వారు మాట్లాడటం నేర్చుకుంటారు. ఈ వయసులో ఫోన్లు ఇవ్వటం ద్వారా వాటినే చూస్తుంటారు. తద్వారా మూడేళ్ల దాకా మాటలు రాకపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఆటిజం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.
Similar News
News January 30, 2026
అమరావతిలో వీధి పోటు పాట్లు… పరిష్కారానికి GO

AP: రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులను కొత్త సమస్య వెంటాడుతోంది. రిటర్న్బుల్ ప్లాట్లు అందుకున్న పలువురికి వీధిపోటు తలనొప్పిగా మారింది. వాస్తుప్రకారం వీధిపోటు ఉంటే ప్రతికూలత, అశుభం అనే భావన ఉండడంతో వాటిని మార్చాలని వారు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. దీంతో పడమర, నైరుతి, దక్షిణం, ఆగ్నేయం దిక్కులు, ఇతర చోట్ల వీధి శూలలున్న ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేలా ప్రభుత్వం GO ఇచ్చింది.
News January 30, 2026
16ఏళ్లలోపు పిల్లలకు SM నిషేధించండి: సోనూసూద్

సోషల్ మీడియా వినియోగంపై నటుడు సోనూసూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు భోజనం చేస్తూ ఫోన్లలో మునిగిపోవడం ఆందోళనకరమని, 16 ఏళ్ల లోపు వారికి SMను నిషేధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. AP ఈ దిశగా అడుగులు వేసిందని, గోవా కూడా అనుసరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిని జాతీయ ఉద్యమంగా మార్చాలని సోనూసూద్ X వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై మీ కామెంట్?
News January 30, 2026
BC రిజర్వేషన్ జీవోలపై స్టే కొనసాగుతుంది: హైకోర్టు

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ఇచ్చిన జీవో(9, 41, 42)ల అమలుపై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. 8 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే దాఖలైన వాటితోపాటు తమ వాదనలు కూడా వినాలని పలువురు కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్లను హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం.మొహియుద్దీన్ల బెంచ్ విచారించింది.


