News December 24, 2024
జనవరి 1న శ్రీశైలం వెళ్తున్నారా?

AP: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో జనవరి 1న స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. న్యూఇయర్ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న అంచనాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఉదయాస్తమాన, ప్రాతఃకాల, ప్రదోషకాల సేవలనూ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భక్తులందరికీ స్వామి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని వెల్లడించారు.
Similar News
News January 22, 2026
గ్రీన్లాండ్పై ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

గ్రీన్లాండ్ను ఎలాగైనా దక్కించుకుంటానన్న <<18921246>>ట్రంప్<<>> సడన్గా రూట్ మార్చారు. ఫోర్స్ వాడనని ప్రకటించారు. ఆయన వెనక్కి తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఇవే అయి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 1.అమెరికా గ్లోబల్ ఇమేజ్ పాడవుతుందన్న భయం. 2.ప్రపంచ దేశాలన్నీ ఏకమై వ్యతిరేకించడం. 3.సైనిక దాడి చేస్తే NATO, UN రూల్స్ బ్రేక్ అవుతాయి. 4.మిత్రదేశాల మధ్య గ్యాప్ వచ్చే రిస్క్ ఉండటం. 5.USలోనే సపోర్ట్ లేకపోవడం.
News January 22, 2026
అభిషేక్ రికార్డు

టీమ్ ఇండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సంచలనం సృష్టించారు. టీ20ల్లో అత్యంత వేగంగా 5వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్గా నిలిచారు. 2,898 బంతుల్లోనే ఈ మార్కు చేరుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రసెల్(2,942), టిమ్ డేవిడ్(3,127), విల్ జాక్స్(3,196), గ్లెన్ మ్యాక్స్వెల్(3,239) ఉన్నారు. కేవలం అంతర్జాతీయ మ్యాచులే కాకుండా లీగ్స్, డొమెస్టిక్ మ్యాచులు ఇందులోకి వస్తాయి.
News January 22, 2026
మేడారం వెళ్తున్నారా?.. Hi అని వాట్సాప్ చేస్తే

TG: మేడారం జాతరకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు 7658912300 నంబర్కు ‘Hi’ అని మెసేజ్ చేస్తే లాంగ్వేజ్ ఆప్షన్ వస్తుంది. నచ్చిన భాషను ఎంచుకొని జాతర సమాచారం, ట్రాఫిక్&రవాణా అప్డేట్స్, వాతావరణ సమాచారం, అత్యవసర సహాయం వంటి వివరాలు పొందవచ్చు. ఈ నెల 28 నుంచి 31 వరకు మహాజాతర జరగనుంది.


