News March 14, 2025

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ వదిలేస్తున్నారా? బచ్చన్ ఏమన్నారంటే..

image

టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ని అమితాబ్ బచ్చన్ వదిలేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం నడుస్తోంది. దానిపై 16వ సీజన్ చివరి ఎపిసోడ్‌లో బచ్చన్ క్లారిటీ ఇచ్చేశారు. ‘హోస్ట్‌గా ఆడియన్స్ నుంచి నాకు చాలా మద్దతు లభించింది. వచ్చే సీజన్‌లో మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. మీ కష్టాన్ని నమ్ముకోండి. కలల్ని సజీవంగా ఉంచుకోండి’ అని ముగించారు. మళ్లీ బచ్చనే ఉంటారని తెలియడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

Similar News

News April 1, 2026

TNలో అల్లర్లకు BJP కుట్ర: స్టాలిన్

image

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ BJPపై CM స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు BJP కుట్ర పన్నిందని, దాన్ని అధికార DMK భగ్నం చేసిందని చెప్పారు. BJP పాలిత రాష్ట్రాలైన UP, మణిపుర్‌లో కొనసాగుతున్న మూక దాడులు, మత ఘర్షణలు TNలో లేవని ఎద్దేవా చేశారు. DMK ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన మహిళలు తమకు నచ్చిన గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు రూ.8వేల కూపన్ ఇస్తామని హామీ ఇచ్చారు.

News April 1, 2026

వాణిజ్య పంటలు సాగుచేస్తే రూ.10,000!

image

TG: వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగుచేసే రైతులకు ఎకరాకు ₹10,000 ప్రోత్సాహకం ఇవ్వాలని GOVT భావిస్తోంది. పప్పుధాన్యాలు, మార్కెట్లో డిమాండ్ ఇతర వాణిజ్య పంటల సాగుకు మారే రైతులకు దీన్ని అందించనున్నారు. దీనిపై CM రేవంత్ అధికారులతో చర్చిస్తున్నారు. ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఎకరాకు ₹20,000 వెచ్చిస్తోంది. పైగా నిల్వ చేయడం సవాలుగా మారుతోంది. పంజాబ్‌లో రైతులకు ₹17,000 ప్రోత్సాహకం ఇచ్చే స్కీమ్ అమల్లో ఉంది.

News April 1, 2026

మ్యాక్స్‌వెల్‌కు ఆస్ట్రేలియా షాక్

image

AUS స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డ్ షాక్ ఇచ్చింది. 21మందితో కూడిన 2026-27 సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో చోటు కల్పించలేదు. రాబోయే 12 నెలల్లో AUS జట్టు 20 టెస్టులు ఆడనుంది. దీని కోసం టెస్ట్ స్పెషలిస్టులకే ప్రాధాన్యం కల్పించింది. ఇప్పటికే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన 37ఏళ్ల మ్యాక్సీ కెరీర్ చరమాంకానికి చేరినట్లే. ఇక యంగ్ ప్లేయర్ సామ్ కోన్ట్సాస్‌కూ 21 మందిలో చోటు దక్కలేదు.