News September 7, 2025
ఫోన్ ఛార్జర్‌ను సాకెట్‌లో వదిలేస్తున్నారా?

చాలామంది ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి బ్యాటరీ ఫుల్ కాగానే ఛార్జర్‌ను అలాగే సాకెట్‌లో వదిలేస్తారు. కానీ ఇలా చేయొద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇలా చేస్తే వోల్టేజ్ పెరిగినప్పుడు ఛార్జర్ పేలిపోవచ్చు. అంతర్గత భాగాలు వేడెక్కి అగ్ని ప్రమాదాలకు కారణం కావచ్చు. స్విచ్ ఆఫ్ చేసినా ఛార్జర్ కొంత మేర విద్యుత్ ఉపయోగిస్తూనే ఉంటుంది. దీంతో విద్యుత్ వృథా అవుతుంది. అన్‌ప్లగ్ చేయడం ఉత్తమం’ అని చెబుతున్నారు.
Similar News
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘పశుపతి’’

వేదాల ప్రకారం ‘పశు’ అంటే కేవలం జంతువులు అని మాత్రమే కాదు, అజ్ఞానంతో, మాయతో బంధీ అయి ఉన్న ప్రతి జీవి అని అర్థం. జీవులన్నింటినీ రక్షించే వాడు, వారిని అజ్ఞాన బంధనాల నుంచి విముక్తం చేసే యజమాని శివుడు. మనలోని పశుప్రవృత్తిని(అరిషడ్వర్గాలను) అణచివేసి, మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే రక్షకుడు ఆయనే. సమస్త జీవరాశికి ఆయనే ఆధారభూతుడు. పాలకుడు. అందుకే శివుడిని భక్తులు పరమేశ్వరుడిగా, పశుపతిగా ఆరాధిస్తారు.
News February 12, 2026
నీటి వసతి లేకుంటే పామాయిల్ సాగు వద్దు

ఆయిల్ పామ్ సాగును ఎలాంటి నేలల్లో చేపట్టినా నీటి వసతి ముఖ్యం. వర్షాధారంగా ఈ పంట సాగును చేపట్టలేము. అందుకే ఏ రైతైనా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పంట సాగు కోసం మొక్కకు రోజుకు 150 నుంచి 250 లీటర్ల నీరు అవసరం అవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా నీరు అందించి మంచి దిగుబడులను పొందవచ్చు.
News February 12, 2026
28,636 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

పోస్టల్ శాఖలో 28,636 GDS పోస్టులకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. ఫిబ్రవరి 16వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో 1,060, తెలంగాణలో 608 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా కేవలం టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం BPMకు రూ.18వేలు, ABPMకు రూ.16వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://indiapost.gov.in/


