News March 20, 2025

పడుకునే ముందు ఈ తప్పు చేస్తున్నారా?

image

ప్రతి ఒక్కరూ సాధారణంగా పడుకునే ముందు పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుని నిద్రిస్తారు. అయితే తలపైన నీళ్లను పెట్టుకోకూడదని, ఇది అశుభమని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రతికూలత వ్యాపించి మానసిక స్థితి దెబ్బతింటుందని పేర్కొంటున్నాయి. అలాగే నెగటివ్ ఎనర్జీ వ్యాపించి ఒత్తిడి, ఆందోళన వంటివి పెరుగుతాయట. రాత్రి పూట గొంతెండిపోయే సమస్య ఉన్నవారు కాళ్ల వైపు వాటర్ బాటిల్ పెట్టుకోవడం ఉత్తమం.

Similar News

News November 14, 2025

పోస్టల్ బ్యాలెట్: కాంగ్రెస్ ముందంజ

image

TG: జూబ్లీహిల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఈ ఉపఎన్నికలో 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. నవీన్ ఇందులో లీడింగ్‌లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుండగా, ఎన్ని ఓట్లు అనేది కాసేపట్లో వెల్లడికానుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగియగా ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత షేక్‌పేట డివిజన్ ఓట్లను కౌంట్ చేస్తున్నారు.

News November 14, 2025

కౌంటింగ్ షురూ..

image

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో 2, 3 గంటల్లో ఫలితాల సరళి తెలియనుంది. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. అటు బిహార్‌లో 2,616 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

News November 14, 2025

ఈనెల 17న జాబ్ మేళా

image

AP: ఈనెల 17న పార్వతీపురం Employment Office ఆధ్వర్యంలో ఆన్‌లైన్ జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. 18ఏళ్లు పైబడిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. మొత్తం 1150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ముందుగా https://rb.gy/68z9mn లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.