News July 28, 2024
మీకన్నా స్వార్థపరులు ఉంటారా?: YCP

AP: అసెంబ్లీకి వెళ్లని జగన్, ఆయన MLAలు రాజీనామా చేయాలని APPCC చీఫ్ షర్మిల్ చేసిన <<13724150>>కామెంట్స్<<>>పై YCP స్పందించింది. ప్రతిపక్షంలో ఉండి మరో ప్రతిపక్షాన్ని తిడుతున్న షర్మిలకు ప్రజా సమస్యలు కనిపించవని విమర్శించింది. ఆమె ట్వీట్ CBN నుంచి వచ్చిందో లేక TGలోని ఆయన ఏజెంట్ దగ్గర్నుంచి వచ్చిందోనని ఎద్దేవా చేసింది. TGలో మాయమాటలు చెప్పి పారిపోయి APకి వచ్చిన షర్మిల కంటే స్వార్థపరులు ఉంటారా అని ప్రశ్నించింది.
Similar News
News January 23, 2026
తిరుమల అప్‌డేట్.. 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మరింత పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం 64,571 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,634 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.84 కోట్లుగా నమోదైంది.
News January 23, 2026
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలో కాస్త తడబడ్డప్పటికీ కాసేపటికే పుంజుకున్నాయి. సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 82,425 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 23 పాయింట్లు లాభపడి 25,313 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో TCS, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL టెక్ షేర్లు లాభాల్లో.. ఇండిగో, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News January 23, 2026
Republic day Special:కమలాదేవి చటోపాధ్యాయ

కమలాదేవి చటోపాధ్యాయ సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు. 1923లో మహాత్మాగాంధీ పిలుపు అందుకుని సహాయ నిరాకరణ ఉద్యమ సేవాదళ్ సంస్థలో పనిచేశారు. విదేశాల్లో పర్యటించి అక్కడి సంస్కరణలు, మహిళల స్థితిగతులు, విద్యాసంస్థలు తదితరాలను పరిశీలించారు. గాంధీజీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1930, జనవరి 26న భారత జాతీయ పతాకాన్ని పోలీసులు అడ్డుకున్నా, ఎగురవేసిన సాహస నారి కమలాదేవి.


