News October 10, 2025
నలభై దాటిందా..ఇవి తినండి

నలభై ఏళ్లు దాటిన తర్వాత మహిళల ఆరోగ్యంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. సమయానికి ఆహారం తీసుకుంటున్నా కొన్నిసార్లు నీరసం కమ్మేస్తుంటుంది. కాబట్టి బ్యాలెన్డ్స్ డైట్ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా అన్నిరకాల విటమిన్లు అందేందుకు తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఆహారంలో ఉండాలి. పాల ఉత్పత్తులు, మాంసాహారం, గుడ్లు తీసుకోవాలి. పీచు పదార్థాలతో పాటు నీటిని ఎక్కువగా తాగాలి. <<-se>>#WomenHealth<<>>
Similar News
News October 11, 2025
రాజధాని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

AP: రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు, భూయజమానులకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక కౌలును విడుదల చేసింది. 495 మందికి అందాల్సిన రూ.6.6కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది. బ్యాంకు లింకేజీ సమస్యలతో పాటు పలు కారణాలతో జమ కాని వారికి 9వ, 10వ, 11వ ఏడాదికి సంబంధించి కౌలు సొమ్ము జమ చేసినట్లు సీఆర్డీఏ తెలిపింది.
News October 10, 2025
గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ బర్త్‌డే సెలబ్రేషన్స్

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన ప్రేయసిని అభిమానులకు పరిచయం చేశారు. మోడల్ మహికా శర్మతో రిలేషన్‌లో ఉన్నారన్న వార్తలు నిజమేనని క్లారిటీ ఇచ్చారు. ఒకరోజు ముందే మహికాతో కలిసి హార్దిక్ తన బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆమెతో కలిసి చిల్ అవుతున్న ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టారు. దీంతో వీళ్లిద్దరు రిలేషన్‌లో ఉన్నారని అధికారికంగా ప్రకటించినట్లు అయ్యింది.
News October 10, 2025
ఈ నెల 16న కర్నూలులో మోదీ సభ

AP: కర్నూలులో ఈ నెల 16న సూపర్ GST-సూపర్ సేవింగ్స్ విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. దీనికి PM మోదీతో పాటు CM, Dy.CM, మంత్రి లోకేశ్ హాజరు కానున్నారు. ఆ రోజు ఉదయం మోదీ సున్నిపెంట హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలం ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. తర్వాత సభా ప్రాంగణానికి వెళ్లి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.