News October 26, 2024
దీపావళికి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. కేంద్రం వార్నింగ్!
దీపావళికి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని CERT-In సూచించింది. ఫిషింగ్, లాటరీ, జాబ్, టెక్ సపోర్ట్, ఇన్వెస్ట్‌మెంట్, COD, ఫేక్ ఛారిటీ, పొరపాటున నగదు పంపడం, డిజిటల్ అరెస్ట్, ఫోన్, పార్సిల్ స్కామ్‌లపై వార్నింగ్ ఇచ్చింది. కాలర్‌ను వెరిఫై చేసుకోవాలని, భయపడొద్దని, వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని, రిమోట్ యాక్సెస్ సాఫ్ట్‌వేర్, APPS ఇన్‌స్టాల్ చేయొద్దని, లింకులు క్లిక్ చేయొద్దని చెప్పింది.
Similar News
News November 2, 2024
కార్తీక దీపోత్సవాలు.. ప్రమిదలు, నూనె, వత్తులు ఉచితం
TG: కార్తీకమాసం సందర్భంగా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇవాళ్టి నుంచి DEC 1 వరకు అన్ని ఆలయాల్లో కార్తీకమాస దీపోత్సవాలు నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ సా.6-8 గంటల వరకు దీపోత్సవ వేడుకలు చేయాలని, పాల్గొనే వారికి 2 మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు ఉచితంగా ఇవ్వాలన్నారు. మహిళలకు ఉచితంగా పసుపు, కుంకుమ ఇవ్వడంతో పాటు ప్రధాన ఆలయాల్లో బ్లౌజ్ పీస్‌లు అందించాలన్నారు.
News November 2, 2024
మురికి టాయిలెట్స్.. రైల్వేకు రూ.30వేలు ఫైన్
తిరుపతి నుంచి వైజాగ్ సమీపంలోని దువ్వాడకు వెళ్లేందుకు 55 ఏళ్ల మూర్తి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో 3AC టికెట్ కొన్నారు. ప్రయాణ సమయంలో మురికి మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవడం, ఏసీ పనిచేయకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. దీనిపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మూర్తి వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా విచారణ జరిపి రైల్వేకు రూ.30వేలు జరిమానా విధించింది.
News November 2, 2024
PIC OF THE DAY
న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఆకట్టుకుంది. డైవ్ క్యాచ్‌తో పాటు ఫీల్డింగ్‌లో అదరగొట్టారని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. ఈరోజు మ్యాచ్ పూర్తయ్యే సరికి కోహ్లీ జెర్సీ బురదమయంగా మారిన ఫొటోను షేర్ చేస్తూ ‘PIC OF THE DAY’ అని కొనియాడుతున్నారు. టీమ్ గెలుపుకోసం ఎంతో కష్టపడతారని అభినందిస్తున్నారు. అయితే, బ్యాటింగ్‌లోనూ ఇదే కసి ఉండాల్సిందని మరికొందరు సూచిస్తున్నారు.