News December 1, 2024
ఈ-సిగరెట్ తాగుతున్నారా..?

ఈ-సిగరెట్లు కూడా ఆరోగ్యానికి హానికరమని Radiological Society of North America అధ్యయనంలో తేలింది. నికోటిన్ రహితంగా భావించే వేప్ లిక్విడ్లో నికోటిన్తో పాటు ప్రొపిలీన్ గ్లైకాల్స్, గ్లిసరిన్, ఫ్లేవరింగ్, రసాయనాలు ఉంటాయని American Lung Association తెలిపింది. ఇవి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని, ఊపిరితిత్తులు శరీరంలోకి ఆక్సిజన్ తీసుకొనే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని తేల్చాయి.
Similar News
News December 5, 2025
ఫ్రెండ్తో అన్నీ పంచుకుంటున్నారా?

స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు. కానీ ఆ చెప్పే విషయాల్లో భార్యాభర్తల అనుబంధాన్నీ చేర్చవద్దంటున్నారు నిపుణులు. వారి మధ్య జరిగే విషయాల్ని మూడోవ్యక్తితో చర్చించకపోవడమే మంచిదంటున్నారు. భాగస్వామితో చిన్న గొడవ గురించి స్నేహితులకు చెబితే మీవారిపై నెగెటివ్ అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. ప్రతిదానికీ బయటివారి సలహాలు కోరుతూ ఉంటే నమ్మకం పోవడమే కాదు.. ఇతరులకీ చులకన అవుతారు. మరిన్ని గొడవలకూ కారణమవొచ్చు.
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు.. తొలి విడతలో 395 స్థానాలు ఏకగ్రీవం

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 4,236 సర్పంచ్ స్థానాలకు గాను 395 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 స్థానాలు ఉన్నాయి. అటు సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్లో 26 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. ఓవరాల్గా 5 గ్రామాల్లో నామినేషన్లు దాఖలవ్వలేదు. మిగిలిన 3,836 స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. కాగా మూడో విడత ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది.
News December 5, 2025
రైతన్నా.. ఈ పురుగుతో జాగ్రత్త

ఖరీఫ్ పంట కోతలు, రబీ పంట నాట్ల వేళ ఏపీ వ్యాప్తంగా 800కు పైగా స్క్రబ్టైఫస్ కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది. చిగ్గర్ అనే పురుగు కాటుకు గురైనవారు తీవ్రజ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలవుతున్నారు. పొలాలు, అడవులు, తడి నేల, పశువుల మేత ప్రాంతాల్లో పని చేసేవారికి ఈ పురుగుకాటు ముప్పు ఎక్కువగా ఉంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


