News November 26, 2024

నిలబడి నీళ్లు తాగుతున్నారా..?

image

నిల‌బడి నీళ్లు తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌ వ్య‌వ‌స్థ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. నిల‌బడి తాగితే నీరు వేగంగా కడుపులోకి ప్రవేశించి ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్‌కు దారితీస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. నీటి వల్ల కలిగే ప్ర‌యోజ‌నాల‌ను పూర్తిగా పొందాలంటే కూర్చొని తాగాల‌ని, అది కూడా ఒక సిప్ తరువాత మరొకటి తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులంటున్నారు. Share It.

Similar News

News November 26, 2024

21 ఏళ్లకే 195 దేశాలు చుట్టేసి రికార్డ్!

image

జీవితకాలంలో వేరే దేశాన్ని ఓసారి చూస్తే గొప్ప అనుకుంటాం. కానీ US యువతి లెక్సీ ఆల్ఫోర్డ్ 21 ఏళ్ల వయసుకే 195 దేశాలు చుట్టేసి గిన్నిస్ రికార్డుకెక్కారు. తాజాగా విద్యుత్ కారులో ప్రపంచమంతా తిరిగిన తొలి వ్యక్తిగా మరో రికార్డునూ సృష్టించారు. కారులో 200 రోజుల పాటు 6 ఖండాలను దాటారు. తన తల్లిదండ్రులు ట్రావెల్ ఏజెంట్లుగా చేసేవారని, వారి స్ఫూర్తితోనే ఈ ప్రయాణాన్ని పూర్తి చేశానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారామె.

News November 26, 2024

‘రక్తంతో సంతకం.. మోసం చేస్తే ఆత్మహత్య చేసుకోవాలి’

image

జపాన్‌లో 150 ఏళ్ల చరిత్ర కలిగిన షికోకు బ్యాంక్ తమ సిబ్బందిగా చేరేవారికి అసాధారణ నిబంధనలు పెట్టింది. ‘ఇక్కడ ఉద్యోగం చేసేవారు డబ్బు చోరీ చేసినా, దొంగతనానికి సహకరించినా ఆ మొత్తాన్ని చెల్లించి ఆత్మహత్య చేసుకోవాలి’ అని అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ మేరకు అధికారిక డాక్యుమెంట్‌పై రక్తంతో సంతకం చేయాలని పేర్కొంది. ఉద్యోగుల్లో నైతికత పెంచేందుకు ఎన్నో ఏళ్లుగా ఇలా చేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.

News November 26, 2024

స్కిల్ డెవలప్‌మెంట్ కోసం డీప్ టెక్నాలజీ: చంద్రబాబు

image

AP: 2029 నాటికి రాష్ట్రంలో 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో నైపుణ్యాభివృద్ధి కోసం డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మిస్తామని చెప్పారు. ‘స్టార్టప్‌లకు రూ.25 లక్షల సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అలాగే యూత్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కృషి చేస్తాం. మరిన్ని ఐటీ పాలసీలపై చర్చిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.