News March 13, 2025
HRA క్లెయిమ్ చేయడానికి ఫేక్ రెంటు రిసిప్టులు పెడుతున్నారా..!

ఫేక్ రిసిప్టులతో HRA TAX బెనిఫిట్స్ పొందుతున్న వారిని IT శాఖ ఈజీగా గుర్తించి ఆదాయంపై 200% పెనాల్టీ వేస్తోందని నిపుణులు అంటున్నారు. HRA క్లెయిమ్ చేసుకొని సరైన రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వకుంటే, రెంట్ రిసిప్టుపై యజమాని PAN వివరాలు తప్పుగా ఇస్తే, FORM 16లో కంపెనీ HRA బెనిఫిట్స్ నమోదు చేయకున్నా ఉద్యోగి క్లెయిమ్ చేస్తే, సరైన డాక్యుమెంటేషన్ లేకుండా పేరెంట్స్, చుట్టాలకు రెంటు ఇచ్చినట్టు చెప్తే దొరకడం ఖాయం.
Similar News
News January 27, 2026
173 పోస్టులు.. దరఖాస్తుకు 3 రోజులే ఛాన్స్

NCERTలో 173 నాన్ అకడమిక్ పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 30 ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.ncert.nic.in * మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 27, 2026
ఆటిజం పిల్లల్ని ఇలా పెంచాలి

ఆటిజం పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారన్నది వారికి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరు చిన్నారుల్లో సంగీతం, కంప్యూటర్లు, బొమ్మలు వేయటం వంటి నైపుణ్యం ఉంటుంది. అందువల్ల వీరిలో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీయటానికి, మరింత సాన బెట్టటానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. అలాగే వీరిలో సమన్వయం, ఏకాగ్రత పెరగటానికి ఆటలు బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు.
News January 27, 2026
NPCILలో 114 పోస్టులు.. అప్లై చేశారా?

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (<


