News January 6, 2025
జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా?
TGలో ఉష్ణోగ్రతలు పడిపోవడం, కాలుష్య తీవ్రత వల్ల వైరల్ ఫీవర్స్, ఫ్లూ వైరస్ వ్యాప్తి బాగా పెరిగింది. దీంతో దాదాపు ప్రతి ఇంట్లో ఒక్కరైనా జ్వరం/దగ్గు/జలుబుతో బాధపడుతున్నారు. కొందరిని గొంతు ఇన్ఫెక్షన్ వేధిస్తోంది. మరోవైపు చైనాలో విజృంభిస్తున్న HMPV వైరస్ లక్షణాలు కూడా ఇలాగే ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏ లక్షణాలతో ఎక్కువమంది ఆసుపత్రుల్లో చేరుతున్నారనే వివరాలను సేకరిస్తోంది. మీరూ జ్వరబాధితులేనా?
Similar News
News January 7, 2025
చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసింది
అవయవదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని బతికించే అవకాశం ఉంటుంది. అయితే, దీనిపై ప్రభుత్వాలు అవగాహన కల్పించినా చాలా మంది దీనికి ముందుకు రావట్లేదు. తాజాగా మహబూబ్నగర్కు చెందిన కేశ అలివేల(53) అనే మహిళ నిన్న చనిపోగా ఆమె కుమారుడు అవయవదానం చేసేందుకు అంగీకరించారు. లివర్, రెండు కిడ్నీలు, రెండు కళ్లు డొనేట్ చేసి ఐదుగురికి పునర్జన్మనిచ్చారు. ఈ విషయాన్ని జీవన్ దాన్ వెల్లడించింది.
News January 7, 2025
పెళ్లిలో మందు, డీజే లేకపోతే రూ.21వేల బహుమతి
వివాహాల్లో మద్యం, డీజే సాధారణంగా మారిపోయాయి. వీటితో ఆనందంతో పాటు అవతలి వారికి అసౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఇబ్బందిని తగ్గించేలా పంజాబ్లోని బఠిండా జిల్లా బల్లా గ్రామ పెద్దలు వినూత్న ఆఫర్ ప్రకటించారు. మద్యం, డీజే లేకుండా పెళ్లి చేసుకున్న వారికి రూ.21వేలు బహుమతిగా ఇస్తున్నారు. వృథా ఖర్చును తగ్గించేందుకే ఈ పథకం ప్రారంభించినట్లు సర్పంచ్ అమర్జిత్ కౌర్ తెలిపారు.
News January 7, 2025
బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలి: భట్టి
TG: బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ యువజన కార్యకర్తల దాడి ఘటనపై Dy.CM భట్టి విక్రమార్క స్పందించారు. భారత సంస్కృతి గురించి గొప్పలు మాట్లాడే బీజేపీ నేతలు ప్రియాంకపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయని మండిపడ్డారు. ఆవేశంలో BJP కార్యాలయంపై చేసిన దాడిని పార్టీ పెద్దలంతా ఖండించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీది అహింస సంస్కృతి అన్నారు. దాడి విషయంలో కాషాయ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.