News March 12, 2025
లిఫ్ట్ ఎక్కుతున్నారా? ఒక్క నిమిషం!

ఇళ్లు, ఆఫీస్‌లు, అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్‌లో నిత్యం లిఫ్ట్‌లు వాడుతుంటాం. కానీ ఎలివేటర్ల నిర్వహణ లోపం వల్ల ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అప్రమత్తతో వీటిని నివారించుకోవచ్చు. మీరు బటన్ నొక్కగానే లిఫ్ట్ మీ ఫ్లోర్‌కు వచ్చిందో లేదో ఒక్కసారి చూసుకోండి. ఒక్కోసారి లిఫ్ట్ క్యాబిన్ రాకున్నా డోర్లు తెరుచుకుంటాయి. చూడకుండా అందులోకి ఎక్కాలని చూస్తే కిందపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
Similar News
News March 12, 2025
హలాల్ మటన్ తినాలని హిందూ గ్రంథాల్లో రాయలేదు: మహా మంత్రి

హిందువులకు హలాల్ మటన్‌కు ప్రత్యామ్నాయంగా మల్హర్ సర్టిఫికేషన్ ఉపయోగపడుతుందని మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణె అన్నారు. ఇస్లామిక్ పద్ధతైన హలాల్‌కు హిందూ మతంతో సంబంధం లేదని, దాని గురించి ఎక్కడా రాయలేదని స్పష్టం చేశారు. ‘హైందవాన్ని ఆచరించేవారు ఒక్కటై హిందూ సమాజం హక్కుల కోసం ప్రత్యామ్నాయ మటన్ తీసుకొస్తున్నారు. తింటే హలాల్ తినాలని లేదంటే మానేయాలని ఇన్నాళ్లూ ఒత్తిడి చేశారు. ఝట్కాకే నా మద్దతు’ అని అన్నారు.
News March 12, 2025
ఆరోజునే భూమి మీదకు సునీతా విలియమ్స్!

భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ దాదాపు 9 నెలల తర్వాత భూమి మీదకు చేరుకోనున్నారు. స్పేస్ఎక్స్ సంస్థ పంపనున్న వ్యోమనౌకలో వీరు తిరిగి భూమి మీదకు చేరుకోనున్నారు. ఈరోజు క్రూ-10ను ప్రయోగించనుండగా, అది ఈనెల 16న ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకురానుంది. సాంకేతిక సమస్యలతో 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
News March 12, 2025
అందుకే శృంగార సీన్లలో నటించట్లేదు: కరీనా

సినిమాల్లో కథను నడిపించేందుకు శృంగార సన్నివేశాలు అవసరం లేదని కరీనా కపూర్ అన్నారు. అందుకే తాను అలాంటి సీన్లలో నటించట్లేదని, పైగా ఆ సన్నివేశాలతో తనకు అసౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ‘పశ్చిమ దేశాలతో పోల్చితే INDలో ఇలాంటి సన్నివేశాలను చూసే విధానంలో తేడా ఉంటుంది. ఇక్కడి ప్రేక్షకులు అలాంటి వాటికి సిద్ధంగా లేరు. దానిని హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్‌లాగా చూడరు’ అని ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.