News February 25, 2025
టాయిలెట్‌కు మొబైల్ తీసుకెళ్తున్నారా?

టాయిలెట్‌లోకి మొబైల్ తీసుకెళ్లి గంటల కొద్దీ మాట్లాడటం, రీల్స్ చూడటం కొందరికి అలవాటుగా మారింది. అయితే కమోడ్‌పై ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మలద్వారంపై ఒత్తిడి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల నొప్పితో కూడిన ఇన్‌ఫ్లమేషన్, మొలలు, తీవ్ర కేసుల్లో యానల్ ఫిస్టులాలు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు. చిరుతిళ్లు ఎక్కువగా తినడం, సరిపడిన నీరు తాగకపోవడమూ దీనికి కారణమవుతున్నట్లు పేర్కొంటున్నారు.
Similar News
News February 25, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్

నిన్న నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్ ఇవాళ పుంజుకుంటోంది. సెన్సెక్స్ 117 పాయింట్లు పెరిగి 74,571 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 22,584 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్ లాభాల్లో కొనసాగుతుండగా సన్ ఫార్మా, హిందాల్కో, కోల్ ఇండియా, లార్సెన్ నష్టాల్లో ఉన్నాయి.
News February 25, 2025
అసెంబ్లీకి వెళ్లేది లేదన్న జగన్.. మీరేమంటారు?

YS జగన్ అసెంబ్లీకి వెళ్లకూడదన్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సరైన వేదిక అని, ప్రతిపక్ష హోదా ఉంటేనే వెళ్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో 10% సీట్లు లేని YCPకి ఎలా ఇస్తారని కూటమి శ్రేణులు నిలదీస్తున్నాయి. అసెంబ్లీలో ఎక్కువ సమయం మాట్లాడేందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని YCP అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News February 25, 2025
ఐసీసీ ట్రోఫీలు: రోహిత్ మరో టైటిల్ సాధిస్తారా?

ఐసీసీ టోర్నమెంట్లలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ రికార్డు కంటిన్యూ అవుతోంది. రోహిత్ నాయకత్వంలో టీమ్ ఇండియా గత 5 ట్రోఫీల్లో సెమీఫైనల్స్‌కు వెళ్లింది. 2022 టీ20 WCలో సెమీస్, 2021-23 WTC రన్నరప్, 2023 వన్డే WCలో రన్నరప్, 2024 టీ20 WCలో విజయం, తాజాగా 2025 CTలో సెమీఫైనల్స్ చేరింది. మరి రోహిత్ మరో ఐసీసీ కప్పు కొడతారా? కామెంట్ చేయండి.