News December 26, 2024

పిల్లలకు చదువుతోపాటు వీటిని నేర్పిస్తున్నారా?

image

పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలంటే ఐదు ఆధ్యాత్మిక అంశాలు నేర్పాలి. పిల్లలను కృతజ్ఞతాభావంతో పెంచాలి. ఎవరైనా సాయం చేసినప్పుడు వారికి కృతజ్ఞతలు చెప్పించాలి. చిన్నతనం నుంచే మనుషులు, మొక్కలు, జంతువులపై దయ ఉండేలా మలచాలి. చిన్నారుల్లో పరధ్యానం పోగొట్టడానికి ఏకాగ్రత అలవర్చాలి. క్షమాగుణం కూడా అలవాటు చేయాలి. ఎవరైనా తప్పు చేసినా పగ తీర్చుకోకుండా క్షమించడాన్ని నేర్పాలి. ఆధ్యాత్మికతపై వారిలో ఆసక్తిని పెంచాలి.

Similar News

News December 27, 2024

US: 240 ఏళ్ల తర్వాత బాల్డ్ ఈగల్‌కు జాతీయ పక్షి హోదా

image

అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్‌ను అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై ఆయన సంతకం చేశారు. 1782 నుంచి ఈ పక్షిని అమెరికా చిహ్నంగా వాడుతున్నా అధికారిక హోదా మాత్రం కల్పించలేదు. 240 ఏళ్ల తర్వాత బైడెన్ దీనికి ఇటీవల ఆమోద ముద్ర వేశారు. ఈ పక్షికి తెల్లటి తల, పసుపు రంగు ముక్కు, గోధుమ రంగులో శరీరం ఉంటుంది.

News December 27, 2024

బలహీనపడిన అల్పపీడనం.. ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దాదాపు 10 రోజుల తర్వాత బలహీనపడింది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ APలోని ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ పలుచోట్ల వానలు పడే అవకాశం ఉందంది. కాగా ఇక వచ్చే వేసవి వరకు అల్పపీడనాలు, భారీ వర్షాలకు ఛాన్స్ లేదని పేర్కొంది.

News December 27, 2024

మళ్లీ పెరిగిన బంగారం ధర

image

ఇటీవల కాస్త తగ్గిన పసిడి ధర మళ్లీ ఎగబాకుతోంది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.280 పెరగగా, ఇవాళ మరో రూ.270 పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రా. ధర రూ.78వేలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పెరిగి రూ.71,500గా ఉంది. అటు కేజీ సిల్వర్ రేట్ లక్ష రూపాయలుగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.