News January 15, 2025

ఈరోజు ప్రయాణాలు చేస్తున్నారా?

image

‘కనుమ నాడు కాకులు కూడా కదలవు’ అనేది సామెత. ఇవాళ ఎలాంటి ప్రయాణాలు చేయకూడదని పెద్దలు చెబుతారు. దీనికి కారణం పూర్వం ఎడ్ల బండ్ల మీదే ప్రయాణాలు జరిగేవి. కనుమ రోజున పశువులను పూజించి ఏడాదిలో ఈ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా బండ్లు కట్టొద్దని నిర్ణయించారు. అందుకే ఈరోజున ప్రయాణాలు చేయొద్దని అంటారు.

Similar News

News December 7, 2025

విత్తన మొలక శాతం.. పంట దిగుబడికి ముఖ్యం

image

పంట దిగుబడి బాగుండాలన్నా, వ్యవసాయం లాభసాటిగా సాగాలన్నా పంటకు ‘విత్తనం’ ప్రధానం. అందుకే మేలైన దిగుబడి కోసం మొలక శాతం బాగా ఉన్న విత్తనాన్ని సేకరించాలి. విత్తన కొనుగోలు తర్వాత దాని మొలక శాతాన్ని పరిశీలించాలి. అది నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలి. అసలు విత్తన మొలక శాతాన్ని ఎలా పరిశీలించాలి? దానికి అందుబాటులో ఉన్న పద్ధతులు ఏమిటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 7, 2025

ఒకరికి 38, మరొకరికి 37.. అయితేనేం అదరగొట్టారు

image

SAతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోవడంలో ‘రో-కో’ కీలక పాత్ర పోషించారు. గత రెండు సిరీస్‌లను గమనిస్తే ఒక్కోసారి ఒక్కో స్టార్ అదరగొట్టారు. AUSతో జరిగిన సిరీస్‌లో రోహిత్ శర్మ(38y) అత్యధిక పరుగులు, సగటు, బౌండరీలు, P.O.Sగా నిలిస్తే, తాజాగా SAతో జరిగిన సిరీస్‌లో అవే రికార్డులు విరాట్ కోహ్లీ (37y) దక్కించుకున్నారు. 37+ ఏళ్ల వయసులోనూ ఈ ఇద్దరూ సూపర్ ఫామ్‌ కొనసాగిస్తూ విజయాలను అందిస్తున్నారు.