News March 31, 2025
స్టూడియో ghibli కోసం ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారా?

సోషల్ మీడియాలో స్టూడియో ghibli ఫొటోల ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరూ చాట్ జీపీటీ లేదా గ్రోక్ వంటి ఏఐల ద్వారా ఫొటోల్ని అప్లోడ్ చేసి ఘిబ్లీ స్టైల్లోకి మార్చుకుంటున్నారు. ఇది చాలా రిస్క్ అంటున్నారు సైబర్ నిపుణులు. ‘మనం ఇష్టపూర్వకంగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి యాప్లు ముఖ కవళికల్ని భద్రపరుచుకుంటాయి. దీని వల్ల వ్యక్తిగత గోప్యత, భద్రతకు కచ్చితంగా భంగం వాటిల్లుతుంది’ అని వివరిస్తున్నారు.
Similar News
News April 2, 2025
‘లాపతా లేడీస్’ కథ దొంగిలించారా?.. రెడిట్ యూజర్ పోస్ట్ వైరల్

ఆస్కార్కు నామినేట్ అయిన ‘లాపతా లేడీస్’పై SMలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘బుర్ఖా సిటీ’ అనే షార్ట్ ఫిల్మ్ నుంచి కథను కాపీ కొట్టారని ఆరోపిస్తూ ఓ రెడిట్ యూజర్ పోస్ట్ చేశారు. దీంతో ఆమిర్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు ఈ స్టోరీని దొంగిలించారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివి చేయడంలో వారెప్పుడూ నిరాశపరచరని సెటైర్లు వేస్తున్నారు. కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2023లో విడుదలైంది.
News April 2, 2025
నిత్యానంద చనిపోలేదు: కైలాస దేశం ప్రకటన

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద చనిపోలేదని ఆయన ప్రకటించుకున్న దేశం ‘కైలాస’ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సురక్షితంగా, చురుకుగా ఉన్నట్లు వెల్లడించింది. నిత్యానంద జీవ సమాధి అయి చనిపోయారని ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ నిన్న వెల్లడించారు. దీంతో ఆయన భక్తులు, అనుచరులు శోక సంద్రంలో మునిగిపోగా.. తాజా ప్రకటన వారికి ఊరట కలిగించింది. కాగా, నిత్యానంద ‘కైలాస’ సౌత్ అమెరికాలోని ఈక్వెడార్లో ఉంది.
News April 2, 2025
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయనున్న వైసీపీ

వక్ఫ్ సవరణ బిల్లుకు YSRCP వ్యతిరేకంగా ఓటు వేయనుంది. లోక్ సభ, రాజ్యసభ రెండింట్లోనూ ఈ బిల్లును వ్యతిరేకిస్తామని ప్రకటించింది. తాము రాజకీయంగా దెబ్బతిన్నా సరే ఈ బిల్లును అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని స్పష్టం చేశారు. అటు ఈ బిల్లుపై టీడీపీ ప్రతిపాదించిన నాలుగు సవరణల్లో మూడింటిని కేంద్రం ఆమోదించింది. నిన్న రాత్రి సీఎం చంద్రబాబు నిపుణులతో చర్చించారు.