News March 31, 2024

iPhone వాడుతున్నారా.. జాగ్రత్త!

image

ఐఫోన్ యూజర్లను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. రీసెట్ పాస్వర్డ్ అంటూ మెసేజ్‌లు పంపి యాపిల్ కస్టమర్ కేర్ నంబర్ నుంచే ఫోన్ చేస్తున్నారు. ‘మీ ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేస్తున్నారు. వారి నుంచి రక్షిస్తాం. ఓటీపీ చెప్పండి’ అని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ సమయంలో OTP షేర్ చేస్తే మన వ్యక్తిగత సమాచారమంతా వారి చేతుల్లోకి వెళ్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Similar News

News October 6, 2024

నేడు లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ

image

నేడు విజయవాడ కనక దుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమివ్వనుంది. త్రిపురత్రయంలో రెండో శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు. తల్లిని కొలిస్తే కష్టాలు తొలిగి, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. మాత అనుగ్రహం పొందేందుకు ‘ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేనమ:’ అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలని పండితులు చెబుతున్నారు.

News October 6, 2024

తొలి టీ20 నెగ్గేదెవరో?

image

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు భారత్ సిద్ధమైంది. నేడు గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. సూర్య కుమార్ నాయకత్వంలోని కుర్రాళ్లు బంగ్లా జట్టుపై ఎలాంటి ప్రదర్శన చేస్తారో అని ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 14 టీ20లు జరగ్గా భారత్ 13 విజయాలు సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ ఒక మ్యాచులో గెలుపొందింది. కాగా గ్వాలియర్‌లో 14 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగనుండటం గమనార్హం.

News October 6, 2024

నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు

image

TG: నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ 2024-25 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 14 వరకు ఆన్‌లైన్‌లో <>దరఖాస్తు<<>> చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సూచించింది. ఈఏపీసెట్-2024 క్వాలిఫై అయిన వారిని మాత్రమే అర్హులుగా పేర్కొంది. వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి, మెరిట్ జాబితాను రిలీజ్ చేస్తామని తెలిపింది.