News March 19, 2024
ఐఫోన్, ఐప్యాడ్ వాడుతున్నారా.. కేంద్రం తీవ్ర హెచ్చరికలు!

ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేసింది. యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్లో పలు రకాలైన లోపాలను గుర్తించామని CERT తెలిపింది. ‘లోపాల కారణంగా పరికరాలను ఎవరైనా హ్యాక్ చేయొచ్చు. పని చేయకుండా చేసి అతి రహస్యమైన సమాచారాన్ని చోరీ చేయొచ్చు. 16.76 వెర్షన్ కంటే పూర్వపు వెర్షన్లు వాడుతున్నవారిని ఇది ప్రభావితం చేస్తుంది. ఆ ఓఎస్ వాడేవారు జాగ్రత్త’ అని సూచించింది.
Similar News
News November 27, 2025
కాకినాడ: వారిని చూసి జగన్ నేర్చుకోవాలి.. యనమల

అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీని చూసి ప్రతిపక్షం ఎలా వ్యవహరించాలో జగన్ చూసి నేర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. చిన్నపిల్లలయినా బహిష్కరణలకు తావు కాకుండా సభలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రస్తావించారన్నారు. ఎప్పటికైనా జగన్ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై చర్చించడం చేయాలని సూచించారు.
News November 27, 2025
MLC రాజీనామాపై 4 వారాల్లో తేల్చండి: హైకోర్టు

AP: MLC జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖపై నిర్ణయాన్ని తెలపాలని మండలి ఛైర్మన్ను హైకోర్టు ఆదేశించింది. రాజీనామాపై సుదీర్ఘకాలం నిర్ణయం తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. విచారణ జరిపి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాజీనామా లేఖ సమర్పించినప్పటికీ చైర్మన్ ఆమోదించడం లేదని జయమంగళ వేసిన పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.
News November 27, 2025
ఢిల్లీలో మరింత పడిపోయిన గాలి నాణ్యత!

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. నేడు ఉదయం గాలి నాణ్యత AQI 351గా రికార్డైంది. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలతోపాటు బురారీ, ఆనంద్ విహార్, చందానీ చౌక్, ఐటీఓ, జహంగీర్ పురి ఏరియాల్లో AQI 300 కంటే ఎక్కువ ఉంది. బుధవారం సాయంత్రం 327 వద్ద ఉన్న గాలి నాణ్యత ఈరోజు ఉదయానికి మరింత దిగజారింది. వరుసగా 21వ రోజు కూడా AQI 300 కంటే ఎక్కువ నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది.


