News March 4, 2025

ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారా?

image

ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది రాత్రుళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే మానసిక సమస్యలు 30 శాతం ఎక్కువవుతాయి. మానసిక ఆందోళన, డిప్రెషన్, చిరాకు వంటివి వస్తాయి. హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీవ గడియారం దెబ్బ తినడం వల్ల మతిమరుపు సమస్య రావచ్చు. ఊబకాయం, షుగర్ జబ్బులు వస్తాయి.

Similar News

News January 29, 2026

తిరుమల కల్తీ నెయ్యి కేసు.. ఛార్జ్‌షీట్‌లో ఏముంది?

image

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఇటీవల CBI సిట్ ఫైల్ చేసిన ఛార్జ్‌షీట్‌లో కీలకాంశాలు ఉన్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. ఆ నెయ్యిలో కొలెస్ట్రాల్ లేనట్లు NDDB రిపోర్టులో తేలిందని, అంటే జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారణ అయినట్లు చెబుతున్నాయి. మరోవైపు పాలు/వెన్న సేకరించకుండా రిఫైన్డ్ పామాయిల్, బీటా కెరోటిన్, ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్ వంటి రసాయనాలతో నెయ్యి లాంటిది తయారు చేశారని వార్తలొస్తున్నాయి.

News January 29, 2026

మొక్కజొన్నలో అధిక దిగుబడి రావాలంటే?

image

రబీ(యాసంగి)లో మొక్కజొన్నను సాగు చేస్తున్న రైతులు అధిక దిగుబడి సాధించాలంటే కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాలి. పంటలో చీడపీడల నియంత్రణతో పాటు మొక్క దశను బట్టి ఎరువులు, నీటి తడులను అందించాలి. లేకుంటే దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. మొక్కజొన్నకు ఈ సమయంలో అందించాల్సిన ఎరువులు, నీటి తడుల్లో జాగ్రత్తలు, కంకిలో చివరి వరకూ గింజ రావాలంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News January 29, 2026

సంజూ.. ఇదేం ఆటతీరు?

image

మొన్నటి వరకు సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేసినవారే ఇప్పుడు అతడి ఆటతీరుపై పెదవి విరుస్తున్నారు. ఇన్ని ఛాన్స్‌లు ఇచ్చినా సద్వినియోగం చేసుకోవడంలేదని మండిపడుతున్నారు. అతడి ఫుట్‌వర్క్‌ అస్సలు బాగోలేదంటున్నారు. వికెట్లను పూర్తిగా వదిలేసి క్లీన్ బౌల్డ్ అవుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. NZతో జరిగిన 3,4వ T20ల్లో అలాగే ఔటైన అతడు.. ఈ సిరీస్‌లో 4మ్యాచుల్లో 40రన్స్ మాత్రమే చేశారు.