News March 12, 2025
సాయంకాలం వాకింగ్ చేస్తున్నారా?

వేసవికాలంలో సాయంకాలం వాకింగ్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీంతో రాత్రి పూట నిద్ర బాగా పడుతుందని అంటున్నారు. ప్రతి రోజూ అరగంట నడిస్తే మెదడు ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా రక్తపోటు సమస్య రాదు. సాయంకాలపు నడకతో శరీరంలోని కండరాలు బలపడటమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాత్రి భోజనం తర్వాత కాసేపు నడవాలని సూచిస్తున్నారు.
Similar News
News October 23, 2025
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు క్యాబినెట్ ఆమోదం

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018లో సెక్షన్ 21(3)ని తొలగించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించగా తాజాగా సీఎం అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా ధ్రువీకరించారు.
News October 23, 2025
మిస్సింగ్ ఉద్యోగులు.. రంగంలోకి ఇంటెలిజెన్స్

TG: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్యలో అవకతవకలపై ఇంటెలిజెన్స్ దర్యాప్తు మొదలైందని విశ్వసనీయ సమాచారం. ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఎంతమంది, ఎంతకాలంగా పని చేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల వివరాలు సేకరించగా.. 1.03 లక్షల మంది సమాచారం లేదు. కానీ, వీరి పేరిట పదేళ్లుగా నెలకు రూ.150కోట్ల జీతాలు జమ అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించింది.
News October 23, 2025
తదుపరి చీఫ్ జస్టిస్ కోసం కేంద్రం కసరత్తు

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ నియామకానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. కొత్త సీజేఐ పేరును సిఫార్సు చేయాలని ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ని కోరింది. కాగా SC సీనియర్ జడ్జి జస్టిస్ సూర్యకాంత్కు తదుపరి సీజేఐగా అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 23తో జస్టిస్ గవాయ్ పదవీకాలం ముగియనుంది.