News April 5, 2025
అశ్లీల వీడియోలు చూసి షేర్ చేస్తున్నారా?

అశ్లీల వీడియోలను చూడటం, షేర్ చేయడం నేరమని TG పోలీసులు హెచ్చరించారు. యువత పోర్నోగ్రఫీకి దూరంగా ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ చూడొద్దని సూచించారు. సోషల్ మీడియాను మంచికోసం వాడుకోవాలని, అశ్లీల వీడియోలను పోస్ట్ & షేర్ చేసేవారిపై నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు బాలల అశ్లీల సన్నివేశాలను పంపినందుకు అరెస్ట్ అయినట్లు తెలిపారు.
Similar News
News April 6, 2025
మావోయిస్టులు లొంగిపోవడానికి కారణం?

మావోయిస్టులు గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో లొంగిపోతున్నారు. వారి లొంగుబాట్లకు కారణాలేంటన్నదానిపై వివిధ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దళ సభ్యుల మధ్య విభేదాలు, సీనియర్లలో వయోభారం, నేటి కాలంలో సిద్ధాంతాలు ఇమడటం లేదన్న భావం, ప్రజల మద్దతు లభించకపోవడం, బలగాల దాడుల తీవ్రత పెరగడం.. ఇలాంటివన్నీ కలగలిసి మావోయిస్టులు లొంగిపోయేందుకు మొగ్గుచూపిస్తున్నారన్న వాదనలున్నాయి. మీరేమనుకుంటున్నారు?
News April 6, 2025
ALERT: రేపు, ఎల్లుండి వర్షాలు

TG: ద్రోణి కారణంగా వచ్చే 2రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో రేపు.. వీటితో పాటు సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో ఎల్లుండి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.
News April 6, 2025
ముస్లింలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది: ఎమ్మెల్సీ కవిత

TG: వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కారణంగానే బీజేపీ సర్కారు బిల్లును ఆమోదింపజేసుకుంది. ముస్లింలకు తీవ్ర నష్టం చేకూర్చే ఈ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి. మైనారిటీల తరఫున మా పార్టీ పోరాడుతుంది. గతంలోనూ వారి అభివృద్ధి, సంక్షేమానికి మేం కృషి చేశాం’ అని గుర్తుచేశారు.