News March 27, 2025
మీ ఫోన్‌పే, గూగుల్‌పే పని చేస్తున్నాయా?

నిన్న రాత్రి 7.30 గంటలకు దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యాప్స్ పనిచేయలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. గంట తర్వాత సమస్యను పరిష్కరించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్రకటించింది. అయినా కొందరు తమ సమస్య అలాగే ఉందని SMలో పోస్టులు పెట్టారు. మరి మీ యూపీఐ పేమెంట్స్ పనిచేస్తున్నాయా? కామెంట్ చేయండి.
Similar News
News March 30, 2025
అప్పుడే నా జన్మ సార్థకం అవుతుంది: సీఎం చంద్రబాబు

AP: జీరో పావర్టీ సాధించగలిగితే తన జన్మ సార్థకం అవుతుందని CM చంద్రబాబు అన్నారు. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు P4 విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారని, వారు తిరిగి సమాజానికి ఇవ్వాలని కోరారు. 20 ఏళ్ల క్రితమే IT ప్రాముఖ్యత చెప్పానని, తన మాట విని IT వైపు వెళ్లిన వారు మంచి స్థితిలో ఉన్నారన్నారు. అధికంగా డబ్బులు సంపాదించే తెలివి ఉన్నవాళ్లు భారతీయులని CM వివరించారు.
News March 30, 2025
రేపు, ఎల్లుండి సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో రేపు రంజాన్ పండుగ జరుపుకోనుండటంతో ప్రభుత్వ బడులు, కాలేజీలు, కార్యాలయాలకు సెలవు ఉండనుంది. APలో రేపు ఒక్క రోజే హాలిడే ఇవ్వగా, TG సర్కారు రేపటితో పాటు APR 1న కూడా సెలవు ప్రకటించింది. బోనాలు, క్రిస్మస్, రంజాన్ తర్వాతి రోజు సెలవుగా ప్రకటించడం గత ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు, సౌదీలో నిన్న నెలవంక కనిపించగా అక్కడ ఇవాళ రంజాన్ జరుపుకుంటున్నారు.
News March 30, 2025
గత ఐదేళ్లు రాష్ట్రంలో కళ తప్పింది: సీఎం చంద్రబాబు

AP: ‘ప్రజలే ముందు’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేస్తున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో కళ తప్పిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అనేక సమస్యలు సృష్టించిందని విమర్శించారు. ఒక్కో చిక్కుముడిని వదిలించుకుంటున్నట్లు తెలిపారు. పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.