News March 5, 2025
ట్రంప్‌తో వాగ్వాదం తీవ్ర విచారకరం: జెలెన్స్కీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాగ్వాదం తీవ్ర విచారకరమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పశ్చాత్తాపపడ్డారు. ట్రంప్ నాయకత్వంలో పనిచేసేందుకు తాము సిద్ధమని తెలిపారు. ‘రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు మేం సిద్ధం. ఇందుకోసం USతో కలిసి పనిచేసేందుకు మేం ఎదురుచూస్తున్నాం. ఇప్పటివరకు US అందించిన సాయాన్ని ఎంతగానో గౌరవిస్తున్నాం. అగ్రరాజ్యానికి ఉక్రెయిన్ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News April 2, 2026
సల్మాన్ – వంశీ పైడిపల్లి సినిమాలో అరవింద్ స్వామి?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ – దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లోని మూవీపై ఆసక్తికర అప్డేట్స్ వచ్చాయి. ఇందులో సీనియర్ నటుడు అరవింద్ స్వామి ఓ పాజిటివ్ రోల్లో కనిపిస్తారని సమాచారం. ఓ పవర్ఫుల్ యాక్షన్ క్యామియోకు బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్‌ను సంప్రదించినట్లు టాక్. ఇక విలన్ పాత్రకు ఓ టాప్ బాలీవుడ్ నటుడిని తీసుకోవాలని మూవీ టీమ్ భావిస్తోందట. ఇదే జరిగితే సినిమాపై అంచనాలు భారీగా పెరగనున్నాయి.
News April 2, 2026
రూపీ సూపర్ రికవరీ

ఇటీవల ఒక డాలరుకు ₹95.12కు చేరి ఆల్ టైమ్ <<19515449>>కనిష్ఠాన్ని<<>> నమోదు చేసిన రూపాయి విలువ క్రమంగా కోలుకుంటోంది. ముఖ్యంగా 24 గంటల వ్యవధిలో భారీ రికవరీ నమోదు చేసింది. ఒక డాలరుకు 93.48గా ఉన్న రూపాయి విలువ ఏకంగా 88 పైసలు పెరిగి 92.60కు చేరింది. యుద్ధం ఆగే సూచనలు, మార్కెట్లు నిన్న సానుకూలంగా ఉండటం రూపాయి రికవరీకి కలిసొచ్చింది.
News April 2, 2026
స్టార్ క్యాంపెయినర్లుగా సీఎం, డిప్యూటీ సీఎం బిజీబిజీ

TG: ఈనెల 9న పుదుచ్చేరి, కేరళం, అస్సాం రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అక్కడ స్టార్ క్యాంపెయినర్లుగా బిజీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేరళంలో పర్యటిస్తుండగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు, రేపు పుదుచ్చేరిలో పర్యటిస్తారు. ఆ తర్వాత ఈనెల 4న కేరళంలోని కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు సైతం కేరళంలో ప్రచారంలో పాల్గొన్నారు. <<-se>>#Elections2026<<>>


