News March 8, 2025
ట్రంప్‌తో వాగ్వాదం.. జెలెన్స్కీకి పెరిగిన ప్రజల మద్ధతు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాగ్వాదం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి 10 శాతం ప్రజా మద్ధతు పెరిగినట్లు KIIS రిపోర్టు తెలిపింది. ట్రంప్‌తో భేటీకి ముందు ఆయనకు 57 శాతం మద్ధతు ఉందని, ఇప్పుడు అది 67 శాతానికి పెరిగిందని పేర్కొంది. ట్రంప్ తమ దేశాధినేతను అవమానించినట్లు ఉక్రెయిన్ ప్రజలు భావించారని, అందుకే ఆయనకు మద్ధతుగా నిలిచారని వెల్లడించింది.
Similar News
News October 28, 2025
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

TG: హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, కూకట్పల్లి, మియాపూర్, నిజాంపేట్, అల్వాల్, కాప్రాలో వాన పడుతోంది. రాత్రి 7.30 గంటల్లోపు నగరమంతా వర్షం విస్తరిస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
సర్జరీ విజయవంతం.. కోలుకున్న శ్రేయస్!

భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నారని Cricbuzz తెలిపింది. Spleen(ప్లీహం)కు గాయం కాగా సిడ్నీ వైద్యులు మైనర్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారని చెప్పింది. నిన్ననే ICU నుంచి బయటికొచ్చిన అయ్యర్ మరో 5 నుంచి 7 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొంది. ఇదే నిజమైతే అతడు త్వరలో మైదానంలో అడుగుపెట్టే ఛాన్సుంది.
News October 28, 2025
ఆ వ్యాయామాలతో బ్రెస్ట్ క్యాన్సర్ కట్టడి

మహిళల్లో వేగంగా విస్తరిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను 30 శాతం వరకూ తగ్గించడంలో రెసిస్టెన్స్ ట్రైనింగ్, హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వ్యాయామాలు పనిచేస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ వ్యాయామాల వల్ల మయోకిన్స్ రిలీజై రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను 30 శాతం వరకు నెమ్మదిస్తుందని తేలింది.


