News September 5, 2024
కేజ్రీవాల్ బెయిల్‌పై వాదనలు.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ <<14028580>>బెయిల్‌పై వాదనల<<>> సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. CBI కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తే అది హైకోర్టు నిర్ణయాన్ని నిరుత్సాహపరిచినట్టే అవుతుందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించారు. అయితే, ఈ వ్యాఖ్యలను ఆక్షేపించిన జస్టిస్ భూయాన్ ‘అలా చెప్పకండి’ అంటూ వారించారు. CM కస్టడీలో ఉన్నందున సెక్షన్41ఏ నోటీసులు అవసరం లేదని రాజు వాదించారు.
Similar News
News February 4, 2025
శుభ ముహూర్తం(04-02-2025)
✒ తిథి: శుక్ల షష్ఠి ఉ.7.53 వరకు
✒ నక్షత్రం: అశ్విని రా.12.52 వరకు
✒ శుభ సమయం: సా.4.22 నుంచి 5.22 వరకు
✒ రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు
✒ యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12 వరకు, రా.10.48 నుంచి 11.36 వరకు
✒ వర్జ్యం: రా.9.15 నుంచి 10.45 వరకు
✒ అమృత ఘడియలు: సా.5.55 -రా.7.24 వరకు
News February 4, 2025
నేటి ముఖ్యాంశాలు
* AP: భారత్‌వైపే ప్రపంచ దేశాల చూపు: CM CBN
* ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు గడువు పొడిగింపు: లోకేశ్
* పద్మభూషణ్ నాలో ఇంకా కసిని పెంచింది: బాలకృష్ణ
* TG: కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్ధం: మంత్రి పొన్నం
* కులగణన నివేదిక ఫేక్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
* తెలంగాణలో 90 శాతం వెనుకబడిన వాళ్లే: రాహుల్ గాంధీ
News February 4, 2025
అప్పుడు రోహిత్.. ఇప్పుడు త్రిష
గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచాక భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్‌లో పడుకున్న ఫొటో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అదే తరహాలో అండర్-19 WC గెలుచుకున్నాక త్రిష కప్ పట్టుకొని పడుకున్న ఫొటోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది. దీంతో పాటు 2024లో సెలబ్రేషన్స్ ఫొటోలను ఇతర ఫొటోలతో పోల్చింది. అప్పటి రోహిత్ సెలబ్రేషన్స్‌ను ఇప్పుడు త్రిష రీక్రియేట్ చేశారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.