News December 13, 2024

హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు

image

TG: అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో పోలీసులు, బన్నీ తరఫు న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం పూర్తైన నేపథ్యంలో కేసు క్వాష్‌పై ఇప్పుడేం మాట్లాడలేమని, బెయిల్ గురించే మాట్లాడాలని బన్నీ తరఫు న్యాయవాదులకు కోర్టు సూచించింది. అటు బన్నీపై నమోదైన సెక్షన్లకు బెయిల్ ఇవ్వొచ్చని ఆయన తరఫు లాయర్లు కోరుతున్నారు. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Similar News

News November 27, 2025

NZB: జి.జి.కళాశాలలో కృత్రిమ మేధపై జాతీయ సదస్సు

image

స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “కృత్రిమ మేధ యుగంలో విజ్ఞాన శాస్త్రాలకు ఉన్న అవకాశాలు & అవరోధాలు”అంశంపై జరుగుతున్న జాతీయ సదస్సును TU వైస్ ఛాన్స్‌లర్ ప్రొ. టి. యాదగిరి రావు, కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ.ఆర్.సాయన్న, ప్రిన్సిపల్ డా.పి.రామ్మోహన్ రెడ్డి, సమన్వయకర్త రామకృష్ణ, ప్రారంభించి, సావనీర్ ఆవిష్కరించారు.

News November 27, 2025

పీరియడ్స్‌లో హెవీ బ్లీడింగ్ అవుతోందా?

image

పీరియడ్స్‌లో 1-3 రోజులకు మించి హెవీ బ్లీడింగ్ అవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు నిపుణులు. ఫైబ్రాయిడ్స్‌, ప్రెగ్నెన్సీ సమస్యలు, పీసీఓఎస్‌, ఐయూడీ, క్యాన్సర్ దీనికి కారణం కావొచ్చు. కాబట్టి సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీన్ని గుర్తించడానికి రక్త పరీక్ష, పాప్‌స్మియర్‌, ఎండోమెట్రియల్‌ బయాప్సీ, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, సోనోహిస్టరోగ్రామ్‌, హిస్టరోస్కోపీ, D&C పరీక్షలు చేస్తారు.

News November 27, 2025

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 30 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

<>మెదక్ <<>>ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 30 కాంట్రాక్ట్ డిప్యూటీ మేనేజర్, జూనియర్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంటెక్, AMIE ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 21 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.300. జీతం నెలకు రూ.30వేలు+IDA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ddpdoo.gov.in