News March 28, 2025

31న ‘అర్జున్ S/O వైజయంతి’ ఫస్ట్ సింగిల్

image

కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న ‘అర్జున్ S/O వైజయంతి’ ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల 31న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘నాయాల్ది’ అంటూ సాగే ఈ పాట పోస్టర్‌ను SMలో షేర్ చేశారు. ఈ చిత్రంలో కళ్యాణ్ తల్లిగా, పోలీస్ ఆఫీసర్‌గా విజయశాంతి కీలకపాత్ర పోషిస్తుండగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Similar News

News March 31, 2025

తిరుమల శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నారు: రోజా

image

AP: కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, తిరుమల శ్రీవారికీ నిద్ర లేకుండా పోతోందని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ‘సంప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. ప్రస్తుతం రోజుకు దాదాపు 10వేల VIP బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారు. మరోవైపు సాధారణ భక్తుల దర్శనాలను తగ్గించారు. ఇదేనా పవన్, BJPల సనాతన ధర్మం?, ఇదేనా చంద్రబాబు నమూనా ప్రక్షాళన?’ అని ప్రశ్నించారు.

News March 31, 2025

ORRపై టోల్ ఛార్జీల పెంపు

image

TG: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్‌)పై టోల్ ఛార్జీలను పెంచేశారు. రేపటి నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వాహనాలకు KMకు 10 పైసలు, మినీ బస్, ఎల్‌సీవీలకు KMకు 20 పైసలు, 2 యాక్సిల్ బస్సులకు 31 పైసలు, భారీ వాహనాలకు 69 పైసల చొప్పున పెంచింది. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా సంస్థ ఈ ఛార్జీలను వసూలు చేస్తోంది.

News March 31, 2025

మోనాలిసాకు ఆఫర్ ఇచ్చిన దర్శకుడి అరెస్ట్!

image

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా‌కు సినిమా ఆఫర్ ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రాకు షాక్ తగిలింది. రేప్ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను డైరెక్టర్ లైంగికంగా వేధించాడని, వీడియోలు తీసి బెదిరించాడని ఓ యువతి ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’ పేరుతో తెరకెక్కించే సినిమాలో మోనాలిసాను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు సనోజ్ ప్రకటించారు.

error: Content is protected !!