News April 3, 2025
ఈనెల 18న ‘అర్జున్ S/O వైజయంతి’ రిలీజ్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తోన్న ‘అర్జున్ S/O వైజయంతి’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని ఈనెల 18న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోకు తల్లిగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News April 4, 2025
సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం

AP: రాష్ట్ర సచివాలయంలోని 2వ బ్లాకులో జరిగిన <<15986572>>అగ్నిప్రమాదం<<>>పై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. బ్యాటరీ, UPS రూమ్లో ఫైర్ అలారం లేకపోవడంపై ఆరా తీశారు. అన్ని బ్లాకుల్లో ఫైర్ అలారాలు తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఫైర్ ఆడిట్ చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
News April 4, 2025
అవి తప్పుడు వార్తలు.. మేం విప్ జారీ చేశాం: వైసీపీ

AP: రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా వైసీపీ తమ ఎంపీలకు విప్ జారీ చేయలేదని వస్తున్న వార్తలను ఆ పార్టీ ఖండించింది. అది పూర్తిగా తప్పుడు ప్రచారం అని, తాము అధికారికంగా విప్ జారీ చేశామని ట్వీట్ చేసింది. కొందరు రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. తాము సెక్యులర్ విలువలకు కట్టుబడి ఉన్నామని వైసీపీ స్పష్టం చేసింది.
News April 4, 2025
SRHకు వెంకటేశ్ అయ్యర్ కౌంటర్?

క్రికెట్లో దూకుడు అంటే ప్రతీ బాల్ను బాదడం కాదని, పరిస్థితులకు తగ్గట్లు ఆడటమని KKR ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ అన్నారు. ‘బాగా ఆడినప్పుడు 250, ఆడనప్పుడు 70 రన్స్కు పరిమితమవ్వాలని మా జట్టు కోరుకోదు. కండీషన్స్ బట్టి అంచనా స్కోరుకు మరో 20 రన్స్ అదనంగా చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలు SRHను ఉద్దేశించినవేనని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.