News November 14, 2024
గ్రూప్-3 నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: CS

TG: నవంబర్ 17, 18 తేదీల్లో జరిగే గ్రూప్-3 పరీక్షకు 1401 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో పరీక్ష సజావుగా, సక్రమంగా నిర్వహించేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నారు.
Similar News
News March 7, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 7, 2026
ఖమేనీ పాలనలో దిగజారిన ఇరాన్ ప్రతిష్ఠ

ఖమేనీ మరణంతో ఇరాన్‌లో నాయకత్వ సంక్షోభం ముదిరింది. 1981 నుంచి అధికారంలో ఉన్న ఆయన పాలనలో ఆ దేశం అంతర్జాతీయ సూచీల్లో అట్టడుగుకు పడిపోయింది. 2025 అవినీతి సూచీలో 153వ స్థానం, పత్రికా స్వేచ్ఛలో 176వ స్థానంతో దారుణమైన స్థితికి చేరింది. ప్రజాస్వామ్యం, పౌర హక్కుల విషయంలోనూ నిరంకుశ పాలనలోనే ఉందని రిపోర్ట్స్ స్పష్టం చేశాయి. సుదీర్ఘ రాజకీయ స్థిరత్వం ఉన్నప్పటికీ సుపరిపాలన అందించడంలో ఖమేనీ విఫలమయ్యారు.
News March 7, 2026
ఈరోజు నమాజ్ వేళలు (07-3-2026) శనివారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.19 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.30 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ♦︎ అసర్: మధ్యాహ్నం 3.50 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.25 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.37 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


