News March 16, 2024
ఆర్మూర్: మూడు ఇళ్లలో చోరీ

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 21, 22 వార్డులలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. నయీముద్దీన్ ఇంట్లో నుంచి దాదాపు రూ.2 లక్షల నగదు, 10 తులాల బంగారం ఎత్తుకెళ్లారని బాధితులు వాపోయారు. షబానా బేగం ఇంట్లో నుంచి రూ.80వేలు, తులం బంగారం ఎత్తుకెళ్లారు. గంగుబాయి ఇంటి తాళం పగలగొట్టి చోరీకి యత్నించగా అలికిడి రావడంతో దుండగులు పరారయ్యారని బాధితులు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News August 17, 2025
NZB: ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

NZB నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందారు. దీంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టాయి. ఆర్మూర్‌కు చెందిన సాయికుమార్(26) రోడ్డు ప్రమాదంలో గాయపడగా చేతికి కాలుకు గాయమైందని చెప్పి హాస్పిటల్ వర్గాలు చేర్చుకుని ట్రీట్మెంట్ ప్రారంభించాయని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యం చేస్తుండగా సాయికుమార్ మరణించాడని తెలపడంతో బంధువులు ఆందోళన చేపట్టారు.
News August 16, 2025
NZB: సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వండి: కలెక్టర్

NZB కలెక్టరేట్లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం తనిఖీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఏమైనా ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచరం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే కలెక్టరేట్లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08462 220183కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
News August 16, 2025
ALERT.. గోదావరి పరీవాహక ప్రజలకు హెచ్చరిక

కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలో భారీగా వరద నీరు పెరిగే అవకాశం ఉన్నందున గోదావరి నదీ పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోచంపాడ్ డ్యామ్ సైట్ EE M.చక్రపాణి హెచ్చరించారు. పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య ప్రజలు గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని ఆయన సూచించారు.